మంత్రి పదవికి, పార్టీకి గంటా రాజీనామా: మరో ఇద్దరు

గంటా శ్రీనివాస రావు మొదటి నుంచీ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆయన ప్రజారాజ్యం పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఆ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో చిరంజీవితో పాటు కాంగ్రెసులోకి వచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గంటా శ్రీనివాస రావు తన రాజీనమా లేఖను గవర్నర్ నరసింహన్‌కు ఫాక్స్ ద్వారా పంపించారు.
గంటా శ్రీనివాస రావు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు కొంత మంది కాంగ్రెసు శాసనసభ్యులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి.
ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
కాంగ్రెసు పార్టీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌లు రాజీనామా చేశారు.
సిఎంతో ఏరాసు భేటీ
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. అనంతరం ఏరాసు మీడియాతో మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. కిరణ్ కొత్తపార్టీ పెడతారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications