Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ పాదయాత్ర కాదు పొర్లుదండాలు పెట్టినా కష్టమే, ఆ క్రెడిట్ ఇవ్వాల్సిందే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు పాదయాత్ర చేస్తానని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. వైయస్ జగన్ ప్రకటన పైన తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రజలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదని, జగన్ ఏం చేసినా ప్రజల నుంచి ఆదరణ రాదని చెబుతున్నారు.

పాదయాత్ర కాదు పొర్లుదండాల యాత్ర చేసినా కష్టమే: పంచుమర్తి అనురాధ
తాజాగా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ జగన్ ను టార్గెట్ చేశారు. జగన్ పాదయాత్ర కాదు పొర్లుదండాల యాత్ర చేసిన ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. వైసిపి అరాచక పాలనను తలుచుకుంటేనే ప్రజలు వణికిపోతున్నారు అన్నారు. జగన్ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ప్రజలను రాబందుల మాదిరిగా పీక్కు తిన్నారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి సుస్థిర పాలనను ప్రజలు కోరుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు.

minister gottipati and mlc panchumarthi anuradha targeted ys jagan over his padayatra and credit comments

జగన్ క్రెడిట్ వ్యాఖ్యలను టార్గెట్ చేసిన మంత్రి గొట్టిపాటి
తాము చేసిన పనులకు చంద్రబాబు క్రెడిట్ తీసుకుంటున్నాడని జగన్ చేసిన వ్యాఖ్యల పైన ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా స్పందించారు. క్యారెక్టర్ లేని మాజీ సీఎం జగన్ క్రెడిట్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏం చేశారని ఆయనకు క్రెడిట్ ఇవ్వాలని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విద్యుత్ శాఖను జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు.

జగన్ వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుతున్నారు
తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలను పెంచి 30 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని, పీపీఏలు రద్దు చేశారని వీటన్నింటి క్రెడిట్ కచ్చితంగా జగన్ కు ఇవ్వాలని ఆయన అన్నారు. జగన్ క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎద్దేవా చేశారు.

జగన్ ను టార్గెట్ చేసిన యనమల
మరోవైపు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వైయస్ జగన్ పాదయాత్ర పైన తీవ్రస్థాయిలో స్పందించారు. జగన్ కేవలం అధికారం కోసమే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన తలపెట్టిన పాదయాత్ర పూర్తిగా ఆయన స్వార్థ ప్రయోజనాల కోసమేనని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చాడని, దోపిడీ వ్యవస్తీకృత నేరాలు, శాంతి భద్రతల లోపాలతో నింపేశారు అని యనమల రామకృష్ణుడు విమర్శించారు.

జగన్ అంటే అరాచకం, ఆర్ధిక సంక్షోభం
జగన్ గత ఐదేళ్ల పాలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి, రాష్ట్రాన్ని 20ఏళ్లు వెనక్కి పెట్టిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ అంటే అరాచకం, ధరల పెరుగుదల, అభివృద్ధి శూన్యం, ఆర్థిక సంక్షోభం అంటూ యనమల ధ్వజమెత్తారు. నియంతృత్వ వైఖరితో జగన్ పాలన హిట్లర్, ముసోలినీ, తుగ్లక్ లో పాల్గొనాలని పాలనను తలపిస్తుందని, వైసిపిని, జగన్ ను ప్రజలు ఎప్పటికీ నమ్మరని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+