రామయ్య సాహసమే ఉద్యోగులకు స్పూర్తి: మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రశంస
అమరావతి: వరద ఉద్ధృతిని లెక్క చేయకుండా తీగలపై నడిచి విద్యుత్ పునరుద్ధరించిన లైన్‌మెన్ రామయ్యపై ప్రశంసలు కురిపించారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకున్నామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
లైన్‌మెన్ రామయ్య చేసిన సాహసమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి కొనియాడారు. ప్రజావసరాలను తీర్చడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపించామని మంత్రి గొట్టిపాటి విరకుమార్ వ్యాఖ్యానించారు.

భారీ వర్షాలకు అల్లూరి జిల్లా సున్నంపాడు, దేవరపల్లికి విద్యుత్ నిలిచిపోయింది. అక్కడి ప్రజలు బాహ్య ప్రపంచంతో ప్రజాసంబంధాలను కోల్పోయారు. ఈ తరుణంలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పని చేస్తున్న లైన్‌మెన్ కూర రామయ్య వరద ఉద్ధృతిని కూడా లెక్క చేయకుండా.. విద్యుత్ పునరుద్దరణే లక్ష్యంగా తీగలపై నడుచుకుంటూ వాగు దాటి విద్యుత్ సేవలను అందించారు. విధి నిర్వహణలో రామయ్య చూపిన సాహసం, తెగువ అభినందనీయమని మంత్రి రవికుమార్ కొనియాడారు.
మీ సాహసమే మాకు స్ఫూర్తి
— Gottipati Ravi Kumar (@ravi_gottipati) July 28, 2024
సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం మా నాయకుడు చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకున్నాము. ప్రజావసరాలను తీర్చడంలో మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపించాము. భారీ వర్షాలకు అల్లూరి జిల్లా సున్నంపాడు, దేవరపల్లికి విద్యుత్ నిలిచిపోయి,… pic.twitter.com/DYfa8OAbtw
ఇది ఎంతో మంది ఉద్యోగులకు ఆదర్శమని, మరెంతో మందిలో చైతన్యం నింపుతోందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్)వేదికగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications