లోకేష్ ను టార్గెట్ చేసి చంద్రబాబుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్!!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. విస్సన్నపేట గ్రామంలో 609 ఎకరాల భూమి తాను కాజేసినట్లుగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 609 ఎకరాలలో ఒక సెంటు భూమి నా పేరు మీద కానీ, నా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఉంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.

తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరూపించకపోతే లోకేష్ ను రాజకీయాల నుంచి తప్పిస్తావా చంద్రబాబు అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ టార్గెట్ చేశారు.ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల పేరుతో కొత్తడ్రామాకు బాబు తెరతీశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబుకు గుర్తు రాలేదని, అధికారం కోల్పోయిన తర్వాత ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.

Minister Gudivada Amarnath challenged Chandrababu by targeting Lokesh.

చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలపై కోపం ఉందని, నువ్వేం చేసినా ప్రజలు జగన్ పక్షానే ఉంటారంటూ గుడివాడ అమర్నాథ్ తేల్చిచెప్పారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మంచి జరగకూడదని చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ గుడివాడ అమర్నాథ్ అసహనం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం పై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని పేర్కొన్న గుడివాడ అమర్నాథ్, ఉత్తరాంధ్ర ప్రజలు త్యాగాలు చేస్తే చంద్రబాబు భోగాలు అనుభవిస్తున్నాడు అని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా షుగర్ ఫ్యాక్టరీ లను మూయించింది ఎవరు అని ప్రశ్నించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ షుగర్ ఫ్యాక్టరీ ల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీరామారావు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, కానీ చంద్రబాబు ఆయనకు వెన్నుపోటు పొడిచారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. తాను రాజకీయాల్లోకి ప్రజల మద్దతుతో వచ్చానని చంద్రబాబు కొడుకు లోకేష్ లాగా సందులో నుంచి రాజకీయాల్లోకి రాలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+