పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి వచ్చే ఏడాది ఉగాది తర్వాత జాతికి అంకితం చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పని చేస్తుంది. ఈ క్రమంలో అక్కడ పనులను పరుగులు పెట్టిస్తోంది. ఇదే సమయంలో కేంద్రానికి పోలవరం విషయంలో పలు విజ్ఞాపనను కూడా చేస్తోంది.

పోలవరం ప్రాజెక్ట్ పనులపై కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శికి మంత్రి వినతి

ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలసిన మంత్రి నిమ్మల రామానాయుడు కేంద్రప్రభుత్వం సహకారంతో పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటే సమాంతరంగా నిర్వాసితుల కోసం సహాయ,పునరావాస పనులు వేగవంతం చేశాం అన్నారు.

minister intiation on polavaram project minister nimmala ramanaidu request to center on polavaram

పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి వినతి

ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పెండింగ్ డిజైన్లకు వెంటనే అనుమతులు వచ్చేలా సహాకరించాలని మంత్రి కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శిని కోరారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువలు 17,500 క్యూసెక్కులకు పెంచిన సామర్ధ్యాల రియంబర్స్మెంట్ కు సహకరించాలన్నారు. వృధాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి వరద జలాలు వినియోగించుకునేలా, పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు తక్షణమే సాంకేతిక-ఆర్దిక అనుమతులు ఇవ్వాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు.

సముద్రపు కోత, నదుల కోతకు గురవుతున్న ప్రాంతాలకు రక్షణకు సాయం కోరిన మంత్రి

ఏటా సగటున 3వేల టిఎంసి నీరు బంగాళాఖాతంలో కలసిపోతుందని వివరించిన మంత్రి నిమ్మల,తుఫానులు, ఆటుపోట్లు వంటి సముద్రపు కోత, నదుల కోతకు గురవుతున్న ప్రాంతాలకు రక్షణకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి వంటి నదుల ఏటి గట్ల పటిష్టతకు సహకరించాలని కోరారు.

మంత్రి రామానాయుడు వినతులకు స్పందించిన కేంద్ర జలశక్తి కార్యదర్శి

డెల్టా డ్రైన్స్ తో పాటు, సముద్రంలో కలిసే చోట, ముఖద్వారాల వద్ద పూడిక తీయడం, వెడల్పు చేయడానికి నిధులు సాయం అందించాలని మంత్రి నిమ్మల కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఆర్ అండ్ ఆర్, భూ సేకరణ వంటి వాటికి కర్ణాటక ముందుకు వెళ్లకుండా సహకరించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. మంత్రి రామానాయుడు విజ్ఞప్తులను విన్న కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి వి ఎల్ కాంతారావు RRR, PMKSY, ఫ్లడ్ మానేజ్మెంట్ పనులకు సహకరిస్తామని మంత్రికి హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+