నిజంగా ఎన్టీఆర్ అభిమానులైతే చంద్రబాబును, లోకేష్ ను చెప్పులతో కొట్టాలి: మంత్రి జోగి రమేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు రాష్ట్రంలో రాజకీయ యుద్ధానికి కారణంగా మారాయి. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో పాల్గొన్న సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రబాబు విజనరీ అని, 2047 ఆయన విజన్ చాలా గొప్పగా ఉందని, ఆయనకు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక గొప్పస్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తారని వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు వైసీపీ నాయకుల ఆగ్రహానికి కారణమయ్యాయి.
ముఖ్యమంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి వారు, ఎంపీ మార్గాని భరత్ చంద్రబాబుని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు. రజినీకాంత్ పైన కూడా మండిపడ్డారు. ఇక తాజాగా మంత్రి జోగి రమేష్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు అని కాదు పేరు పెట్టాల్సింది ఎన్టీఆర్ ను చంపిన కొన్నిచోట్ల సంబరాలు అని పేరు పెడితే సరిగ్గా సరిపోయేది అంటూ చురకలంటించారు. ఎన్టీఆర్ చనిపోయిన 27 సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారత రత్న కోసం పోరాడతానని చంద్రబాబు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు, దేశ రాజకీయాల్లో కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు ఎన్టీఆర్ కు భారత రత్న అప్పుడు ఎందుకు ఇప్పించలేదని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఇక రజినీకాంత్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాడని, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడం లో రజనీకాంత్ చంద్రబాబుకు సహకరించారని మండిపడ్డారు. బావ చంద్రబాబుతో చేతులు కలిపి బాలకృష్ణ కూడా కన్న తండ్రి చావుకు కారణమయ్యాడు అని విమర్శించారు.
ఇప్పుడు బాలకృష్ణ ఎన్టీఆర్ యుగపురుషుడు అంటున్నారని జోగి రమేష్ మండిపడ్డారు. మీరే చంపి.. మీరే దండేసి.. మీరే దండం పెడతారని చంద్రబాబు, బాలయ్య లను టార్గెట్ చేశారు. చంద్రబాబు రాజకీయమంతా రక్త చరిత్ర అని మండిపడిన మంత్రి జోగి రమేష్ వంగవీటి మోహన్ రంగా హత్య కు కూడా చంద్రబాబే కారణమన్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తే చంద్రబాబు పాదయాత్ర చేశాడని, ఇక ఇప్పుడు వైయస్ జగన్ పాదయాత్ర చేస్తే బఫూన్ పాక్కుంటూ వెళుతున్నారని లోకేష్ ను టార్గెట్ చేశారు. ఏది చూసినా కాపీ కొట్టే వ్యవహారాలే తప్పా వాళ్ళకంటూ ఒక ఆలోచన లేదన్నారు. నిజంగా ఎన్టీఆర్ అభిమానులు అయితే చంద్రబాబును, లోకేష్ ను చెప్పులతో కొట్టాలని, వారిని ఎక్కడికక్కడ నిలదీయాలని జోగి రమేష్ ఘాటుగా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications