చంద్రబాబు గ్రాఫ్ ఎంత దారుణంగా పడిపోయింది
రాబోవు ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగానే వరుస సభలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉండేలా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం నెల్లూరు జిల్లాలో ''రా కదిలి రా'' సభను నిర్వహించారాయన. ఈ సభలో జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.
జగన్ పనైపోయిందని..వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు తెలిపారు. నెల్లూరు వైసీపీ నాయకులపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్యజమెత్తారు. అయితే చంద్రబాబు తమ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు వైసీపీ నాయకులు కౌంటరిస్తున్నారు.

దీనిలో భాగంగానే మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..నెల్లూరులో చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన చెప్పుకొచ్చారు. ఎంత గొంతు చించుకున్నా కూడా ప్రజలు చంద్రబాబును నమ్మేస్థితి లేదని మంత్రి విమర్శించారు. చంద్రబాబు ప్రసంగం ప్రజలను ఆకట్టుకోవడం లేదని..అందుకే వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేయడానికి ఆయన సిద్ధపడ్డారని కాకాణి గోవర్థన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

చంద్రబాబు గ్రాఫ్ ఎంత దారుణంగా పడిపోయిందో అందరికీ అర్థమైపోయిందని మంత్రి విమర్శించారు. చంద్రబాబే కాదు టీడీపీ నేతల్లో ఎవరికి దమ్మున్నా వ్యవసాయ రంగం ఏ ప్రభుత్వంలో అభివృద్ది చెందిందో చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని..ఎంతమంది వచ్చినా మళ్లీ జగనే సీఎం అంటూ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications