సత్య నాదెళ్లపై చంద్రబాబు అసత్యాలు - మంత్రి కాకాని..!!
టీడీపీ అధినేత చంద్రబాబు కు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ చేసారు. అబద్ధాలకు ప్రతిరూపం చంద్రబాబు అని అన్నారు. బాబు జీవితమంతా అబద్ధాలమయమేనని ఫైర్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్యనాదెళ్ల ఎదగడానికి హైదరాబాద్‌లో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థాపించిన మైక్రోసాఫ్ట్ కారణమని చంద్రబాబు అసత్యాలు చెప్పారని కీలక వ్యాఖ్యలు చేసారు. ఎవరు సక్సెస్ అయినా ఆ క్రెడిట్ తనదేనని చంద్రబాబు ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేసారు.
రాష్ట్రంలో ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో..లబ్ది కలిగిందో ఏ గ్రామంలో అయినా చర్చకు సిద్దమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ చేసారు. చంద్రబాబు, అచ్చున్నాయుడు తన సవాల్ స్వీకరించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో చంద్రబాబు మాయం చేసారని దుయ్యబట్టారు. అర్హులై ఉండి సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు అందనివారిని గుర్తించి వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని వివరించారు. జూలై 1వ తేదీ రేపటి నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందిని మంత్రి చెప్పుకొచ్చారు.

మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్యనాదెళ్ల ఎదగడానికి హైదరాబాద్‌లో టీడీపీ హాయంలో స్థాపించిన మైక్రోసాఫ్ట్ కారణమని చంద్రబాబు చెప్పిన అంశాన్ని మంత్రి ప్రతావించారు. సత్య నాదెళ్ల 1984-88 మధ్య బెంగళూరులో ఇంజినీరింగ్ పూర్తిచేశారని... 1988లో ఇంజినీరింగ్ పూర్తయిన తరువాత అమెరికా వెళ్లారని గుర్తు చేసారు. 1990 నాటికి మాస్టర్ డిగ్రీ పూర్తిచేశారని... సన్ మైక్రో సిస్టమ్‌లో చేరారని వివరించారు. 1992లో సన్ మైక్రో సిస్టమ్ నుంచి మైక్రోసాఫ్ట్‌లో చేరారని చెప్పారు. సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్‌లో చేరేనాటికి ముఖ్యమంత్రి కాలేదని చెప్పుకొచ్చారు. 1992లో మైక్రోసాఫ్ట్ చేరిన సత్యనాదెళ్ల ...హైదరాబాద్‌లో 2004లో ఓపెన్ చేసిన మైక్రోసాఫ్ట్‌లో పనిచేయబట్టి సీఈవోగా ఎదగారంటూ అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
నిలువెత్తు అబద్ధానికి ప్రతిరూపం చంద్రబాబు అని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేసారు.నేషనల్ హైవే కాన్సెప్టుకు నేనే కారణమని చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేసారు. చంద్రబాబుకు మతిభ్రమించిందని అనేకమంది వైద్యులు అంటున్నారు. చంద్రబాబు మాట్లాడే 'బ్రీఫ్డ్ మీ' ఇంగ్లిష్‌కు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు వస్తాయా అని ప్రశ్నించారు. పిల్లలకు ఇంగ్లిష్ నేర్పించడం తప్పు అన్నట్టుగా మాట్లాడే నీచ స్థితికి చంద్రబాబు దిగజారిపోయారని వ్యాఖ్యానించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత జరిగిన లబ్ధి ఏంటనే దాని పైన చర్చకు సిద్దమని స్పష్టం చేసారు. నమ్మిన ప్రజలను వంచించడం తప్ప ఏ ఒక్క వర్గానికైనా అండగా నిలిచిన చరిత్ర టీడీపీకి ఉందా అంటూ మంత్రి నిలదీసారు.












Click it and Unblock the Notifications