చంద్రబాబు పొత్తుల లెక్కల వెనుక - మంత్రి కాకాణి..!!
ఏపీలో ఎన్నికల పొత్తుల పైన స్పష్టత వస్తోంది. 2014 తరహా పొత్తులు రిపీట్ కానున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. బీజేపీతో పొత్తు ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వచ్చాయి. ఈ సమయంలో జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు పొత్తుల ప్రయత్నాల పైన వైసీపీ మంత్రులు కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు పొత్తుల వెనుక అసలు కారణాలు ఏంటో వెల్లడించారు.
సీఎం జగన్ నాయకత్వంలో వైసీపీ బలంగాఉన్న కారణంగానే చంద్రబాబు పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కాకాణి దుయ్యబట్టారు. ఏదైనా కొత్త పార్టీ వస్తే కూడా చంద్రబాబు పొత్తు పెట్టుకుంటా రని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం విఫలం అయితే ఆయనకు ఇతర పార్టీలతో పొత్తులు ఎందుకని అని ప్రశ్నించారు. చంద్రబాబు మోసం చేస్తారని ప్రజలకు కూడా అర్ధం అయ్యిందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు హయాం కంటే తాము రైతులకు ఎక్కువ మేలు చేసామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మరోసారి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు మోస పూరిత హామీలు ఇస్తున్నారని మంత్రి కాకాణి మండిపడ్డారు.

చంద్రబాబు తనపై ఉన్న కేసుల్లో ఓ ఒక్కదానికైనా సీబీఐ విచారణకు సిద్ధపడాలని మంత్రి కాకాణి పేర్కొన్నారు. 24 గంటల్లో దీనికి స్పందించాలని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. తన పైన వచ్చిన ఆరోపణల పై సీబీఐ విచారణకు అభ్యంతరం లేదని చెప్పిన అంశాన్ని కాకాణి గుర్తు చేసారు. ఇప్పుడు సీబీఐ క్లీన్ చిట్ ఇస్తే సీబీఐ సరిగ్గా విచారించలేదని చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై అనేక ఆరోపణలు వచ్చాయి..ఎన్నో కేసులలో స్టే లు తెచ్చుకున్నారని గుర్తు చేసారు. చంద్రబాబు అవినీతి చేయకపోతే సీబీఐ విచారణకు అంగీకరించాలని మంత్రి గోవర్ధన్ రెడ్డి సవాల్ చేసారు.












Click it and Unblock the Notifications