వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు: ఏంకాదని బీజేపీ మంత్రి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

అనంతపురం: భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మైత్రికి ఎలాంటి విఘాతం కలగదని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ మంగళవారం అన్నారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో రాష్ర్టానికి కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవమని చెప్పారు.

ఆయన మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాల్లో అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయ పాలన పాటించకుండా విధులకు హాజరుకాని వైద్యులను సస్పెండ్‌ చేయాలని సూచించారు.

కాగా, బడ్జెట్‌లో ఏపీకి సరైన కేటాయింపులు జరగలేదని టీడీపీ నేతలు బీజేపీ పైన భగ్గుమంటున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు బడ్జెట్ పైన అసంతృప్తి వ్యక్తం చేయగా, హీరో నందమూరి బాలకృష్ణ సహా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కామినేని శ్రీనివాస రావు

కామినేని శ్రీనివాస రావు

భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మైత్రికి ఎలాంటి విఘాతం కలగదని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ మంగళవారం అన్నారు.

బాలకృష్ణ

బాలకృష్ణ

కేంద్ర ప్రభుత్వం పైన హిందూపురం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

బాలకృష్ణ

బాలకృష్ణ

బాలకృష్ణ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. రూ.100 కోట్లు ముష్టివేసి పోలవరం ప్రాజెక్టును కట్టుకోమని చెబితే ఎలా అని ప్రశ్నించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.

బడ్జెట్

బడ్జెట్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మూడు రోజుల క్రితం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

English summary
Minister Kamineni Srinivas clarifies on BJP-TDP tie up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X