హయగ్రీవ భూములపై మంత్రి కన్నబాబు కీలక ఆదేశం; బురదచల్లటం అలవాటైందని ఆగ్రహం
విశాఖ లో ఎక్కడ భూకబ్జాలు జరగలేదని, ఒక గజం భూమి కూడా అన్యాక్రాంతం కాకూడదనేది ఏపీ ప్రభుత్వ విధానమని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. హయగ్రీవ భూములపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించినట్టు మంత్రి కన్నబాబు వెల్లడించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, వీఎంఆర్డీఏ నుండి పూర్తి సమాచారం సేకరించి సమగ్ర నివేదికను త్వరలో అందజేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. హయగ్రీవలో లోటుపాట్లు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.

హయగ్రీవ భూముల ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశం

హయగ్రీవ భూములపై జనసేన నిరసన
ఇదిలా ఉంటే బుధవారం నాడు డిఆర్సి మీటింగ్ ప్రాంగణం బయట జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అరాచకాలు చేస్తున్నారంటూ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జీ.వి, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు వ్యతిరేకంగా నిరసన నిర్వహించారు. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో హయగ్రీవ భూముల వివాదంపై ఒక నిర్ణయం తీసుకోవాలని హయగ్రీవ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. 500 కోట్ల భూమిని ప్రభుత్వం కాపాడాలని పేర్కొన్న జనసేన నేతలు, అక్రమాలకు పాల్పడిన స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జీ.వి ని, ఎంపి ఎం వి వి సత్యనారాయణ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

హయగ్రీవ ఇన్ ఫ్రా అధినేత 200 కోట్ల భూములపై సంచలన వీడియో
విశాఖలో రెండు వందల కోట్లు భూమిని అక్రమంగా కొట్టేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ హయగ్రీవ ఇన్ ఫ్రా అధినేత ఇటీవల విడుదల చేసిన వీడియో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఒకప్పుడు తన ఆడిటర్ గా పనిచేసిన ప్రస్తుత విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా పిలవబడే జీ వెంకటేశ్వర్ కొంతమంది రాజకీయ పెద్దలతో కలిసి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.

వైసీపీ నేతలపై బెదిరింపు ఆరోపణలు, డీఆర్సీ మీటింగ్ లో చర్చ
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో బెదిరించి 2 వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను 15 కోట్ల రూపాయలకు తన పేరిట రాయించుకున్నారని, హయగ్రీవ ఇన్ ఫ్రా యజమాని జగదీశ్వరుడు చేసిన ఆరోపణలతో వివాదం చెలరేగింది. జగదీశ్వరుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో వైసీపీ ఎంపీ ఎంవి సత్యనారాయణ, స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జీ వెంకటేశ్వర్ ను టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే జిల్లా అభివృద్ధి సమావేశంలో దీనిపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ క్రమంలో ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు మంత్రి కన్నబాబు.

Click it and Unblock the Notifications