జగన్ కు భయం తెలియదు-జానీ సినిమాతో భయపెడతావా : చూసుకుందాం రా -కొడాలి నాని సవాల్..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాదంటూ..తాము అధికారంలోకి వస్తామంటూ పవన్ చేసిన వ్యాఖ్యల పైన మంత్రి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ స్పీచ్ లకు జనం భయపడుతున్నారని..అభిమానులు భయపడతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్క్రిప్టు చదవుతుంటే ఆయన సంతోషిస్తాడని చెప్పారు. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి పవన్ అంటూ తీవ్రంగా స్పందించారు. జగన్ కు భయం అంటే తెలియదని...సోనియాకే భయ పడలేదని చెప్పుకొచ్చారు.

సోనియానే లెక్క చేయలేదు
జగన్ లెక్క చేయని కారణంగానే అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైళ్లో పెట్టారంటూ వివరించారు. పవన్‌కల్యాణ్ జీవితంలో సీఎం జగన్‌ను ఓడించలేరని చెప్పారు. జగన్‌ను మాజీ ముఖ్యమంత్రిని చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నువ్వు ముందు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో చూసుకోవాలని నాని ఎద్దేవాచేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ తిరిగి చంద్రబాబు -బీజేపీ-కాంగ్రెస్ తో కలిసి రావాలని..చూసుకుందాం రా అంటూ నాని ఛాలెంజ్ చేసారు.

జానీ సినిమా చూపించి భయపెడతావా
పవన్ ఎలా భయపెడతాడు..మరో జానీ సినిమా చూపించి భయపెడతాడా అంటూ ప్రశ్నించారు. పార్టీ పెట్టి రెండు స్థానాల నుంచి పోటీ చేసి రెండింటా ఓడి రికార్డు సాధించిన ఘనత పవన్ కే దక్కుతుందంటూ ఎద్దేవా చేసారు. చంద్రబాబు మెప్పు కోసమే పవన్ మాట్లాడుతారని...పవన్ మాటలు చూస్తూ చంద్రబాబు మురిసిపోతారంటూ నాని వ్యాఖ్యానించారు. రెండు జెడ్పీటీసీలు.. పదివేల ఎంపీటీసీల్లో వంద గెలిచి తానేదో విజయం సాధించినట్లుగా పవన్ ప్రచారం చేసుకుంటున్నాడని నాని ఫైర్ అయ్యారు.

చంద్రబాబు రాసిన స్క్రిప్టు మేరకే
ఒక సారి టీడీపీ - బీజేపీతో, మరో సారి కమ్యూనిస్టులతో, ఇంకో సారి మాయావతితో జత కట్టారని..బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే ఎస్సీ ఓట్లు చీల్చి జగన్ ను దెబ్బ తీయవచ్చనే పన్నాగం పన్ని...ఫ్లాప్ అయ్యారంటూ చెప్పుకొచ్చారు. పవన్ చేసిన వ్యాఖ్యల పైన ఇప్పటికే మంత్రులు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. ఇక, ఇప్పుడు బద్వేలు ఉప ఎన్నిక రావటంతో ఈ ఎన్నిక లో ఈ సారి బీజేపీ - జనసేన పొత్తులో భాగంగా జనసేన అభ్యర్ధి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో..అక్కడ వైసీపీ వర్సెస్ జనసేన బలం ఏంటనేది నిరూపించుకొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
Recommended Video

కొడాలి నాని వ్యాఖ్యల కలకలం
ఈ ఉప ఎన్నిక ఫలితం సైతం కీలకంగా మారనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ పార్టీ అభ్యర్ధిని ఖరారు చేయటంతో పాటుగా మంత్రి పెద్దిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. గతంలోనూ పవన్ కళ్యాణ్ వర్సెస్ మంత్రి కొడాలి నాని మధ్య మాటల యుద్దం సాగింది. ఇప్పుడు పవన్ అసలు వచ్చే ఎన్నికల్లో అధికారం మారుతుంది..వైసీపీ 15 సీట్లకే పరిమితం అవుతుందంటూ చేసిన వ్యాఖ్యలతో మంత్రులు వరుసగా రియాక్ట్ అవుతున్నారు. కొడాలి నాని వ్యాఖ్యల మీద జనసేన స్పందన ఏంటనేది చూడాలి.












Click it and Unblock the Notifications