కుప్పమైనా..మైలవరమైనా ఎగిరేది వైసీపీ జెండానే : ఉమా పకోడీ బెదురింపులకు భయపడొద్దు-కొడాలి నాని..!!
టీడీపీ అధినేత చంద్రబాబు పైన మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు ఒక పగటి వేషగాడు, పిట్టలదొర అంటూ ఫైర్ అయ్యారు. డ్వాక్రా సంఘాలను తనే ప్రవేశపెట్టానని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నాడు. 2014లో అధికారంలోకి రావడానికి డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకున్నాడు. డ్వాక్రా సంఘాలను మోసం చేసిన గజమోసగాడని ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో డ్వాక్రా సంఘాలను మోసం చేసిన వాడిగా చంద్రబాబు పేరు సువర్ణాక్షరాలతో లిఖించవచ్చని మంత్రి ఎద్దేవా చేసారు.

పులివెందులైనా...కుప్పం అయినా వైసీపీ జెండానే
చాలా మంది తెలుగుదేశం సన్నాసులకు ఓ విషయం తెలియదని చెబుతూ.. వైఎస్సార్‌సీపీ అంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అంటే టీడీపీ కంటే బలమైన మాస్ ఇమేజ్ ఉన్న శక్తివంతమైన పార్టీ. పులివెందుల అయినా.. కుప్పమైనా..గుడివాడైనా, మైలవరమైనా.. మరెక్కడైనా వైఎస్సార్‌సీపీ జెండానే ఎగురుతుందని మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సారధ్యంలో కొందరు దొంగలు ఇప్పటికే పర్యటనలు మొదలు పెట్టారని వ్యాఖ్యానించారు.

ఉయా పకోడి బెదిరింపులకు భయపడద్దు
ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారు. మళ్ళీ అధికారంలోకి రావాలని రాజకీయ నిరుద్యోగులు కొందరు పర్యటనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దేవినేని ఉమ జిల్లాలో తిరిగి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. దేవినేని ఉమ కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి అధికారం శాశ్వతం కాదని అధికారులకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకోసారి అధికారులను బెదిరిస్తే కేసులు పెట్టండని కొడాలి ఉద్యోగులకు సలహా ఇచ్చారు.ఉమా పకోడీ బెదిరింపులకు అధికారులెవరూ భయపడొద్దు... కేసులు పెట్టండి అని చెప్పారు.
Recommended Video

మా నెంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టేసాడు
మీకు అండగా మేమున్నాం... దేవినేని ఉమా పకోడీ బెదురింపులకు అధికారులెవరూ భయపడొద్దని.. మిమ్మల్ని ఇబ్బంది పెడితే కేసులు పెట్టండి... మీకు అండగా మేమున్నామంటూ మంత్రి హామీ ఇచ్చారు. తాను..వంశీ ఫోన్ చేసినా ఫోన్లు చేసినా ఎత్తడు..మా ఫోన్లు బ్లాక్ లో పెట్టేశాడంటూ మంత్రి నాని చెప్పుకొచ్చారు. వసంత కృష్ణ ప్రసాద్ గ్రావెల్, కంకర అమ్ముకున్నాడని దేవినేని ఉమ మాట్లాడుతున్నాడు.. ఆ పనులు చేసేది దేవినేని ఉమ అని విమర్శించారు. తలశిల రఘురాం చెప్పిన పనులు తాము చేస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications