ప్రాంతీయ పార్టీలను కబళించేందుకు బీజేపీ కుట్ర: కొల్లు, టీఆర్ఎస్‌పై ఆగ్రహం
అమరావతి: బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రాంతీయ పార్టీలను కబళించేందుకు కుట్ర పన్నుతోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అన్నాడీఎంకే, తెరాస పార్టీలు సభను అడ్డుకోవడం బీజేపీ కుట్ర అని అనుమానం వ్యక్తం చేశారు.
కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ రావాలని చెబుతున్న టీఆర్ఎస్, మరోవైపు బీజేపీకి మద్దతుగా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రాంతీయ పార్టీలు బలపడటం ఖాయమన్నారు.

కాగా, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపేందుకు కేంద్రం భయపడుతోందని టీడీపీ ఆరోపించింది. లోకసభ వాయిదా అనంతరం వారు మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతోనే బీజేపీ అడ్డుకుంటోందన్నారు. పార్లమెంటు చరిత్రలో ఇది చీకటి కోణం అన్నారు. అవిశ్వాసం ఎదుర్కొనే ధైర్యం బీజేపీకి లేదన్నారు.












Click it and Unblock the Notifications