వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జగన్‌ను నమ్ముకుంటే బతుకు బస్టాండ్, టిడిపితో టచ్‌లో 30 మంది ఎమ్మెల్యేలు'

నిన్న నంద్యాల, నేడు కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుతో టిడిపిలో ఉత్సాహం కనిపిస్తోంది. వైసిపికి వరుస ఓటముల నేపథ్యంలో టిడిపి నేతలు వైయస్ జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

30 YSRCP MLAs Are In Touch With TDP To Join | Oneindia Telugu

విజయవాడ: నిన్న నంద్యాల, నేడు కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుతో టిడిపిలో ఉత్సాహం కనిపిస్తోంది. వైసిపికి వరుస ఓటముల నేపథ్యంలో టిడిపి నేతలు వైయస్ జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

దిమ్మతిరిగే షాక్: పవన్ కళ్యాణ్‌పై విమర్శలా, ఇవి కనిపించడంలేదా?దిమ్మతిరిగే షాక్: పవన్ కళ్యాణ్‌పై విమర్శలా, ఇవి కనిపించడంలేదా?

సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర ఉన్న సమయంలో వైసిపికి ఈ ఫలితాలు షాకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు వైసిపి నేతలు టిడిపితో టచ్‌లో ఉన్నారని, ఆ పార్టీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారనే ప్రచారం సాగుతోంది.

జగన్ రాజకీయ జీవితం క్లోజ్, 30 మంది టిడిపిలోకి

జగన్ రాజకీయ జీవితం క్లోజ్, 30 మంది టిడిపిలోకి

తాజాగా, మంత్రి కెఎస్ జవహర్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. జగన్‌ రాజకీయ జీవితం ముగిసిందని ఎద్దేవా చేశారు. నంద్యాల ఎన్నికల తర్వాత కూడా జగన్‌లో మార్పు రాకపోవడంతో వైసిపికి చెందిన 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని బాంబు పేల్చారు.

నంద్యాలతో వైసిపిది తప్పని తేలింది

నంద్యాలతో వైసిపిది తప్పని తేలింది

నంద్యాల ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ అవమానపరుస్తున్నారని జవహర్‌ మండిపడ్డారు. ఇప్పటి వరకు దళితులు, క్రైస్తవులు, ముస్లింలు వైసిపి వైపు ఉన్నారనే అపోహను వైసిపి నేతలు కల్పించారని, అయితే, నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలతో ఆ అభిప్రాయం తప్పని తేలిందన్నారు.

జగన్ మాత్రమే మిగులుతారు

జగన్ మాత్రమే మిగులుతారు

వైసిపిలో జగన్ మాత్రమే మిగులుతారని, మిగతా వారంతా ఇతర మార్గాలు చూసుకుంటున్నారని జవహర్‌ అన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు కొందరు టిడిపిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. నంద్యాల ఎన్నికలతో శిల్పా సోదరులను జగన్ బలి చేశారని, కాకినాడతో వైసిపి పని అయిపోయినట్లేనన్నారు. ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొడాలి నానికి దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేయాలన్నారు. అక్కడ టిడిపి తరఫున సామాన్యుణ్ని నానిపై పోటీ పెట్టి గెలిపిస్తామన్నారు.

జగన్.. రాజీనామా చెయ్

జగన్.. రాజీనామా చెయ్

పులివెందులలోనూ టిడిపి విజయం సాధించడం ఖాయమని, జగన్‌కు దమ్ముంటే పులివెందులలో రాజీనామా చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర గురువారం సవాల్‌ విసిరారు. వైసిపి నాయకులు నంద్యాలలో డబ్బులు పంచుతూ దొరికిపోయారని, కానీ ఫలితాలు వచ్చిన తర్వాత టిడిపి డబ్బు పంపిణీ చేసి గెలుపొందిందని ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. ఇది జగన్‌ దివాలాకోరు రాజకీయానికి పరాకాష్ట అన్నారు.

జగన్‌లోని సైకో మరోసారి బయటకు, రోజాపై సెటైర్లు

జగన్‌లోని సైకో మరోసారి బయటకు, రోజాపై సెటైర్లు

నంద్యాల ఫలితాల తర్వాత జగన్‌లోని సైకో మరోసారి బయటికొచ్చారని కొల్లు రవీంద్ర అన్నారు. జగన్‌ గొప్ప నాయకుడు అని రోజా పొగడ్తలతో ముంచెత్తడం నెటిజన్లకు పెద్ద జోకుగా మారిపోయిందని, సెటైర్లు వేస్తున్నారన్నారు.

జగన్‌ను నమ్ముకుంటే బతుకు బస్టాండ్

జగన్‌ను నమ్ముకుంటే బతుకు బస్టాండ్

జగన్‌ను నమ్ముకుంటే తమ బతుకు బస్టాండే అనే భయం ఆ పార్టీ నాయకులను వెంటాడుతోందని కొల్లు రవీంద్ర అన్నారు. నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించుకోలేని జగన్‌ మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలనడం ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి అన్న చందంగా ఉందన్నారు.

English summary
Telugu Desam Party leader and Minister KS Jawahar on Thurday said that 30 YSR Congress Party MLAs are touch with Telugu Desam Party to join.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X