Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం పీఠం కోసం వడివడిగా అడుగులేస్తున్న మంత్రి లోకేష్.. బిగ్ ప్లాన్!

ఏపీ మంత్రి నారా లోకేష్ రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారా? భవిష్యత్తులో సీఎం అవ్వాలన్న ఆలోచనలో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారా? పార్టీ పైన పట్టు సాధించటం కోసం, పార్టీ ఎమ్మెల్యేలను తన వారిగా మార్చుకోవడం కోసం రంగంలోకి దిగారా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

నారా లోకేష్ కీలక రాజకీయ నిర్ణయం

రాజకీయాలలో ముఖ్య భూమిక పోషించడానికి, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీపైన, సీఎం పీఠం పైన ఆధిపత్యం చెలాయించాలని భావిస్తున్న నారా లోకేష్ దానికోసం కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు ఒక్కో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా భేటీ నిర్వహించి, ఆ భేటీల ద్వారా ఆ నియోజకవర్గాల్లోని సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కారం దిశగా అడుగులు వేయాలని లోకేష్ ఆలోచిస్తున్నారు.

Minister Lokesh sensational political decision in AP politics a big story for future target as CM

లోకేష్ తో ఎమ్మెల్యేలు నేరుగా చర్చించే అవకాశం

ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులతో ఈ భేటీ ద్వారా గడపడం వల్ల, నారా లోకేష్ పట్ల వారికి సానుకూలత వస్తుంది అనేది కూడా ఆయన అభిప్రాయంగా తెలుస్తుంది. ఈ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజల అవసరాలు, అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యేలు లోకేష్‌తో నేరుగా చర్చించే అవకాశం ఉంటుంది.

పార్టీపై బలమైన ముద్ర, సీఎం పీఠం కోసం వడివడిగా అడుగులు

నారా లోకేష్ అటు పార్టీ-ప్రభుత్వ సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెబుతున్నప్పటికీ, దీని వెనక భవిష్యత్తులో పార్టీ పైన బలమైన ముద్ర వేసే, సీఎంగా ఎటువంటి వ్యతిరేకత లేకుండా అందరి మద్దతు కూడగట్టే పెద్ద ప్లాన్ ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

పార్టీలో తన స్థానాన్ని బలపరచే యత్నం

ఈ భేటీలు కేవలం పరిపాలనా అంశాలకే పరిమితం కాకుండా, పార్టీ అంతర్గత రాజకీయాల్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగా నిర్వహిస్తున్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. భవిష్యత్తులో పార్టీ పగ్గాలు చేతిలోకి తీసుకునే ప్రక్రియలో భాగంగా, ఎమ్మెల్యేలు, వారి కుటుంబాలతో సాన్నిహిత్యం పెంచుకోవాలని లోకేష్ భావిస్తున్నట్లు సమాచారం.

అందరినీ ఏకతాటి మీదకు తెచ్చే ప్లాన్

పార్టీలో ఎలాంటి వ్యతిరేకత లేకుండా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలన్నదే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నాయకత్వంపై నమ్మకం పెంచడం, అంతర్గత అసంతృప్తులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+