రోజాలా వద్దు, పురంధేశ్వరిని చూసి నేర్చుకొండి: మాణిక్యాలరావు కామెంట్స్!
ఎలాంటి భాష ఉపయోగించకూడదో రోజాను చూసి నేర్చుకోవాలన్నారు.
విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆదివారం నిర్వహించిన బీజేపీ కార్పొరేటర్ల ఆత్మీయ అభినందన సభకు మంత్రి మాణిక్యాలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరిలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రజా సమస్యలపై స్పందించేటప్పుడు, బహిరంగ వేదికలపై ప్రసంగించేటప్పుడు ఎలా మాట్లాడాలో, ఏవిధంగా వ్యవహరించాలో పురంధేశ్వరిని చూసి నేర్చుకోవాలన్నారు. అదే సమయంలో ఎలాంటి భాష ఉపయోగించకూడదో రోజాను చూసి నేర్చుకోవాలన్నారు.

ఏదైనా విషయంపై స్పందిస్తున్నామంటే.. వెనుకా ముందు ఆలోచించకుండా నోరు జారడం మంచిది కాదన్నారు. సమావేశంలో కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను ఆయన అభినందించారు.












Click it and Unblock the Notifications