భార్య, కొడుకుతో కుంభమేళాకు మంత్రి నారా లోకేష్..
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ లతో కలిసి మహా కుంభమేళాకు వెళ్లారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వారితో సెల్ఫీ తీసుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోను టీడీపి కార్యకర్తలు, పలువురు నేతలు సైతం షేర్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
కుటుంబ సమేతంగా ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు నారా లోకేష్. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి వారణాసి లోని కాలభైరవ ఆలయాన్ని దర్శించుకున్నారు. అలానే అక్కడి నుంచి కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం విశాలాక్షి ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం 5.25 గంటలకు వారణాసి నుంచి విజయవాడకు తిరిగి ప్రయాణం అవుతారని సమాచారం.

ఇక ఈ నెల 26 వరకు మహా కుంభమేళా నిర్వహించనున్నారు. ఇప్పటికే 50 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మన దేశంలోని వారే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళాకు సామాన్యభక్తులతో పాటు ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు 1.36కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.












Click it and Unblock the Notifications