ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కూటమి సర్కారు కృషి చేస్తోంది. ఈ మేరకు విశాఖను టెక్నాలజీ హబ్ గా మార్చేందుకు మంత్రి నారా లోకేష్ సంకల్పించినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు వైజాగ్ నగరంలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. నాస్‌డాక్‌లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఈ భారీ ప్రాజెక్టును చేపడుతోంది.
50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో డేటా సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ కేంద్రం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత దాదాపు వెయ్యి మందికి ఉపాధి లభించనుందని స్పష్టం చేస్తున్నారు.

ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖ నగరం అంతర్జాతీయంగా డిజిటల్ గేట్‌వేగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త చరిత్రకు శ్రీకారం..
— Telugu Desam Party (@JaiTDP) October 12, 2025
రుషికొండ ఐటీ పార్క్ లోని హిల్ నెంబర్-3లో సిఫీ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో రూ.1500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ను సిఫీ అభివృద్ధి… pic.twitter.com/eImWNFLGuh
నారా లోకేశ్ మాట్లాడుతూ.. సూపర్ సిక్స్" కార్యక్రమంలో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే తమ ప్రధాన లక్ష్యం అని వెల్లడించారు. ఐటీ రంగంలో మాత్రమే 5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలన్న టార్గెట్‌తో ముందుకెళ్తున్నామని తెలిపారు. టీసీఎస్‌కు తక్కువ ధరకు భూముల కేటాయింపుపై కొందరు కోర్టుకు వెళ్లినప్పటికీ.. కేటాయింపుల తర్వాత అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గుచూపాయని ఆయన వివరించారు.
డబుల్ ఇంజిన్ సర్కారు ఇప్పుడు బుల్లెట్ రైలులా దూసుకెళ్తోందని లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అజెండాకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రస్తుతం 80 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని, త్వరలోనే పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిచేలా చర్యలు తీసుకుంటున్నామని లోకేశ్ తెలిపారు. అంతే కాకుండా హైదరాబాద్ అభివృద్ధికి 30 సంవత్సరాలు పట్టిందని.. కానీ విశాఖ అభివృద్ధికి 10 సంవత్సరాలు చాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ దీర్ఘకాలిక లక్ష్యమని పేర్కొన్నారు.
-
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
RDT: ఫలించిన మంత్రి లోకేష్ మంత్రాంగం-మళ్లీ మొదలైన ఆర్డీటీ సేవా ప్రస్థానం..!! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications