జగన్... తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడు, నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేసిన మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని కథలు మాట్లాడితే కుదరదని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం జగన్ కి సూచించారు. జగన్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ సెక్స్ లో ఓ పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అర్ధరాత్రి జీవోలు విడుదల చేయలేదని, చీకట్లో లెక్కలు చెప్పలేదని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు.

తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కొని కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము మింగేసిన జగన్ కి ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని మంత్రి నారాయణ లోకేష్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద బాధితుల పేరుతో కోట్ల రూపాయలు స్వాహా చేసిందని జగన్ తో పాటు వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. వరద బాధితుల కోసం కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించిన జగన్ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.

Minister Nara Lokesh who targeted YCP chief Jagan and made allegations

వరద బాధితులకు కనీసం ఒక వాటర్ ప్యాకెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వని జగన్ మా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. వరద బాధితుకు కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించిన జగన్ ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా ?, వరద బాధితులను జగన్ ఎన్నిసార్లు కలిశారుు అని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. జగన్ అన్ని ఫేక్ విషయాలు చెప్తున్నారని, ఆయన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి నారా లోకేష్ అన్నారు.

Minister Nara Lokesh who targeted YCP chief Jagan and made allegations

ఇకనైనా జగన్ తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని, లేదంటే ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద బాధితులకు ఆర్థిక సహాయం చేసిన విషయం తెలిసిందే. వరద బాధితుల పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, టీడీపీ నాయకులు ప్రజలకు ఇవ్వాలన్ిసన డబ్బులు స్వాహా చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్లోని మంత్రులు, టీడీపీ నాయకులు తిప్పి కొడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+