Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతి పై ప్రభుత్వం కీలక ప్రకటన- డెడ్ లైన్..!!

ఏపీ రాజధాని అమరావతిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనుల పైన కసరత్తు చేస్తోంది. కేంద్రం హామీ మేరకు ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతికి రూ 15 వేల కోట్ల రుణం పైన వచ్చే వారం ఒప్పందం జరగనుంది. అదే విధంగా రాజధాని నిర్మాణాల డిజైన్లు.. టెండర్లు .. కాలపరిమితి పైన ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పనుల ప్రారంభం పైన నిర్ణయం తీసుకుంది.

జనవరి నుంచి ప్రారంభం
అమరావతిలో పనుల ప్రారంభానికి సంబంధించి సీఆర్డీఏ - ప్రభుత్వం కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే డిజైన్లతో పాటుగా టెండర్ల ఖరారు పైన ప్రణాళికలు సిద్దం చేసారు. నిర్మాణ పనులకు ఆర్దిక ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రం హామీ మేరకు ప్రపంచ బ్యాంకు అమరావతి కోసం రూ 15 వేల కోట్ల రుణం పైన నవంబర్ 17, 18 తేదీల్లో ఏపీ ప్రభుత్వం ఢిల్లీలో ఒప్పందం చేసుకోనుంది. ఇదే సమయంలో అమరావతి అభివృద్ధి పనుల కోసం నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31లోగా టెండర్లు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Minister Naranyana key announcement over Amaravati construction works

మూడేళ్లలో పూర్తి
ఇక, రాజధాని అమరావతి నిర్మాణ డిజైన్లలో ఎలాంటి మార్పులు లేవని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అయితే నిర్మాణంలో ఆర్టిఫిషియల్ టెక్నాలజీని వాడుతామని చెప్పారు. నిర్మాణాలకు పాత టెండర్ల కాల పరిమితి ముగిసినందున న్యాయపరమైన చిక్కులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వచ్చే జనవరి నుంచి సీఆర్డీఏ ఆధ్వర్యంలో రాజధాని అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే మూడు సంవత్సరాల్లో బిల్డింగ్​ల నిర్మాణం పూర్తి చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. అటు కేంద్రం ఇప్పటికే తాము అమరావతికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చింది.

కేంద్రంతో సమన్వయం
తాజాగా కేంద్ర మంత్రివర్గం అమరావతికి కొత్త రైల్వే లైన్ కు ఆమోదం తెలిపింది. దీని ద్వారా రాజధాని ప్రాంతానికి ముఖ్యమైన రైల్వే లైన్లతో అనుసంధానం ఏర్పడనుంది. 2029 నాటికి ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. రాజధాని లో నిర్మాణ పనులతో పాటుగా కొత్త రైల్వే లైన్ పనులు ఒకే సారి ప్రారంభించే అవకాశాల పైన కేంద్రంతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. మధ్యలో నిలిచిన నిర్మాణాలను ముందుగా పూర్తి చేసేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అటు కేంద్రం అమరావతిలో రింగ్ రోడ్ నిర్మాణానికి ముందుకు రావటంతో.. ఎక్కడా సమన్వయం లో సమస్యలు లేకుండా ప్రత్యేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో..కొత్త సంవత్సరంలో అమరావతి పనులు వేగవంతం కానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+