కొడుకు 'స్పీడ్' గురించి తెలియని నారాయణ, డౌట్ లేకున్నా..: మంత్రికి జగన్ ఫోన్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ బుధవారం తెల్లవారుజామున హైద్రాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ బుధవారం తెల్లవారుజామున హైద్రాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ప్రమాదానికి అతివేగం ప్రధాన కారణం. అయితే, మంత్రి నారాయణకు ఈ విషయం తెలియదట.

అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి నారాయణ లండన్‌లో ఉన్నారు. ఆయన ఈ వార్త విని కుప్పకూలిపోయారు. కొడుకు మృతదేహం చూసి ఆయన కన్నీరు మున్నీరయ్యారు.

ర్యాష్ డ్రైవింగ్ తెలియదు

ర్యాష్ డ్రైవింగ్ తెలియదు

తన కొడుకు ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడని తనకు తెలియదని, తెలిసి ఉంటే వారించేవాడినని నారాయణ ఉద్వేగానికి లోనయ్యారు. తనతో కలిసి ప్రయాణించినప్పుడు మామూలు వేగంతోనే వెళ్లేవాడని, అందుకే తానెప్పుడు అనుమానించలేదని ఆయన చెప్పారు.

అనుమానం రాకున్నా హెచ్చరికలు

అనుమానం రాకున్నా హెచ్చరికలు

అప్పటికీ వేగంగా వెళ్లొద్దని పలుమార్లు హెచ్చరించానని నారాయణ తెలిపారు. కొడుకు మృతదేహం వద్ద విలపిస్తున్న నారాయణను ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు.

నారాయణకు జగన్ ఫోన్

నారాయణకు జగన్ ఫోన్

తనయుడు కోల్పోయిన బాధలో ఉన్న మంత్రి నారాయణకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఫోన్ చేసి పరామర్శించారు.

విషాదం

విషాదం

ఇదిలా ఉంటే, నిషిత్‌తో పాటు మృతి చెందిన అతని స్నేహితుడు రవివర్మ కూడా ప్రాణాలు కోల్పోవడంతో అతని స్వస్థలం టంగుటూరులో విషాదం నెలకొంది. నిషిత్, రవివర్మ ఎప్పటి నుంచో స్నేహితులు.

తండ్రికి చేదోడు వాదోడు

తండ్రికి చేదోడు వాదోడు

కాగా, నిషిత్ తండ్రి నారాయణ బాధ్యతలు పంచుకోవడంలో ఎప్పుడూ ముందుండేవాడు,. అటు కుటుంబ సభ్యులు, ఇటు బంధువులతో ఉంటూ అందరివాడిగా మన్ననలు పొందాడు. నిషిత్ 8వ తరగతిలో ఉండగానే జంతుజాలం, మనుషుల మనస్తత్వాలపై అమెజాన్ ఫ్యాక్ట్స్ అనే పుస్తకం రాశాడు. అది విక్రయించగా వచ్చిన సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించారు.

యజమానిగా కంటే..

యజమానిగా కంటే..

విద్యా సంస్థల్లో పని చేస్తున్న సిబ్బందికి యజమాని కంటే కూడా తోడి సభ్యుడిగానే ఉంటూ వారు బాధలను పంచుకునేవాడని అంటారు. బీబీఎం చదివే రోజుల్లో వారంలో అయిదు రోజులు కళాశాలకు వెళ్లి మిగతా రెండు రోజులు సంస్థ బాధ్యతలు నిర్వర్తించేవాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+