పవన్, జగన్‌లు సైంధవులు, అమరావతిలోనే ఉంటాను రండి: నారాయణ సవాల్
Recommended Video

అమరావతి: వైసీపీ అధినేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీలపై మంత్రి నారాయణ శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీలు లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. వారు ముగ్గురు రాష్ట్రానికి సైంధవుల్లా మారారని ఆరోపించారు. ప్రతి దానికి తాము లెక్క చెప్పామన్నారు.
ఆయన పెన్నా బ్యారేజీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పెన్నా బ్యారేజీ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని చెప్పారు. కాంక్రీట్ పనులు, గేట్లు, బిగించే పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. మరో రెండు నెలల్లో బ్యారేజీ అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు.

శుక్రవారం ఉంటాను రండి
కేంద్రానికి ఇప్పటికి మూడుసార్లు యూసీలు పంపించామని మంత్రి నారాయణ తెలిపారు. యూసీలు ఇవ్వలేదని, లెక్కలు తప్పుగా చూపిస్తున్నామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎవరు వచ్చినా యూసీలు చూపిస్తామని, తాను శుక్రవారం సీఆర్డీఏ కార్యాలయంలో ఉంటానని చెప్పారు.

ఇవన్నీ పంపించాం
రూ.1514.16 కోట్లు ఖర్చు చేసినట్లు యూసీలు పంపించామని నారాయణ తెలిపారు. ఫిబ్రవరి 21 నాటికి పరిశీలనలో ఉన్న బిల్లులను కూడా జోడించి మార్చిలోనూ పత్రాలు పంపించామన్నారు. శాసనసభ నిర్మాణానికి రూ. 561.92 కోట్లు, రహదారులు, డ్రెయిన్లకు రూ. 512.98 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారమిచ్చామన్నారు. అమరావతి ప్రభుత్వ సిబ్బంది గృహాల నిర్మాణానికి రూ. 2209 కోట్ల అంచనా వ్యయంలో రూ.271.78 కోట్లు ఖర్చు చేసినట్లు పంపించామన్నారు.

రాజధాని యూసీలు పంపించాం
అమరావతి అభివృద్ధికి సంబంధించి సలహాలిచ్చేందుకు నియమించుకున్న వివిధ కన్సల్టెంట్లకు రూ. 167.48 కోట్లు మొత్తంగా రూ.1514.16 కోట్లకు చాలా స్పష్టంగా యూసీలు సమర్పించామని నారాయణ చెప్పారు. రాజధాని నిర్మాణానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని, అక్కడ 1600 కి.మీ. రహదారి నిర్మాణం చేపడుతున్నామన్నారు.

వారు తక్కువ ఇచ్చినా
ఇప్పటికే 255 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం ప్రారంభించామని నారాయణ తెలిపారు. కేంద్రం కేవలం రూ.1500 కోట్లు ఇచ్చినా, రూ.22 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించామని చెప్పారు. కొందరు బీజేపీ నాయకులు అవాస్తవాలు మాట్లాడడం, ఒక వర్గం మీడియా కూడా ఇలా మాట్లాడటం సరికాదన్నారు.

ఎవరికి ఎంతైనా ఇవ్వండి
మొదటి యూసీలో అప్పటికి ఖర్చు చేసిన నగదుతో పాటు, రూ.773 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని గత ఏడాది జులైలో పంపించామని నారాయణ చెప్పారు. అప్పుడు కూడా ఇది ఖర్చు అవుతుందనే ఇచ్చామే తప్ప ఖర్చు అయినట్టు చూపలేదని అన్నారు. బీజేపీ, వైసీపీ, జనసేన నాయకులు మాత్రం రాజకీయం చేస్తున్నారన్నారు. ఎవరికి ఎంతైనా ఇచ్చుకోండి, కానీ ఏపీకి మాత్రం విభజన చట్టం ఆధారంగా న్యాయం చేయాలన్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications