బడమేరు గట్లు ఎత్తు పెంచేశారు, గండ్లు పనులు పూర్తి, నిమ్మలకు అభినందనలు
విజయవాడను ముంచెత్తి ఆనగరం ప్రజలకు నిద్రాహారాలు లేకుండా చేసిన బుడమేరు గండ్లను ఎట్టకేలకు పూడ్చివేశారు, బుడమేరకు మూడు గండ్లుడు పడటంతో వరద నీరు విజయవాడలోకి చేరుకుని ఆ నగరాన్ని అతలాకుతలం చేసింది. భారీ వర్షాల కారణంగా బుడమేరుకు మూడు గండ్లు పడటంతో వాటిని పూడ్చివేశామని ఆంధ్రప్రదేశ్ జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
ఆరు రోజులు నిద్రాహారాలు మాని బుడమేరు గట్టుపైనే ఉన్నామని, చివరకు విజయవంతంగా మూడు గండ్లు పూడ్చివేశామని మంత్రి నిమ్మల రామానాయుడు సంతోషం వ్యక్తం చేశారు. వరద ప్రవాహం తట్టుకునేలా బుడమేరు గట్లు ఎత్తు పెంచే పనులను చేపట్టామని, మంత్రి నారా లోకేష్ సూచన మేరకే ఈ పనులు పూర్తి చేశామని జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

భారీ వర్షాలు పడి ఆకస్మిక వరద వచ్చినా గట్లు తట్టుకునేలా ఆ గట్లును బలోపేతం చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. వారం రోజులుగా చెరువులను తలపించేలా పంట పొలాలు మారిపోయాయని, ఇప్పుడు మూడు గండ్లు పూడ్చివేయడంతో వరదనీరు నిలిచిపోయి పొలాలు బయట పడుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో మళ్ళీ ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, సుమారు 8 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత వలన విజయవాడలోకి వరద నీరు ప్రవాహం ఆగిపోయిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. విజయవాడలోని సింగ్ నగర్, జక్కంపూడి, నిడమానూరు వరకు నిలిచిపోయిన నీటిని కొల్లేరు పంపేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నీళ్లు పోయేలా చర్యలు చేపట్టేలా సంబంధిత అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

బుడమేరు గండ్లు పూడ్చివేయడానికి శక్తి వంచన లేకుండా పనిచేసిన సంబంధిత సిబ్బంది, అధికారులు, మద్రాసు నుండి వచ్చిన ఆర్మీ సిబ్బందికి మంత్రి నిమ్మల రామానాయాడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గత ఆరు రోజుల నుండి సంఘటన స్థలంలోనే మకాం వేసి బుడమేరు గండ్లను పూడ్చివేయడంలో విజయం సాధించిన మంత్రి నిమ్మల రామానాయుడిని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు అభినందించారు.












Click it and Unblock the Notifications