'రాజకీయ నాయకుల్ని అసహ్యించుకునేలా జగన్ మాటలు, ట్యూటర్ అవసరం'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు రౌడీలు, గూండాలు మాట్లాడే భాషలా ఉందని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు రౌడీలు, గూండాలు మాట్లాడే భాషలా ఉందని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు.
జగన్ తన భాషను మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. రాజకీయ నాయకులను ప్రజలు అసహ్యించుకునేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. ఆయన నాగరిక భాష నేర్చుకోవాలని, అవసరమైతే ట్యూటర్‌ని పెడతామన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి జగన్ ఆటంకంగా మారారని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు జగన్ తన పార్టీకి చెందిన ఎంపీలతో కోర్టులలో కేసు వేయిస్తున్నారన్నారు. పోలవరంతో రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. దానిని జగన్ అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.
కాగా, అంతకుముందు జగన్ ఒంగోలు కలెక్టరేట్ వద్ద ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన విషయం తెలిసిందే. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు సీఎం చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారన్నారు. 108కు ఫోన్ చేస్తే అంబులెన్స్ ఎప్పుడొస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications