'హైదరాబాద్ రావొద్దు, బాబుపై హజారే కూడా మాట్లాడలేరు కదా!'
హైదరాబాద్: రుణమాఫీ ఇబ్బందుల పైన రైతుల నుండి తమకు 80వేల లేఖలు వచ్చాయని, రైతులెవరూ హైదరాబాదుకు రావొద్దని, ఈ నెల 27వ తారీకు నుండి మే 15వ తేదీ వరకు కలెక్టరేట్లలో వినతులు స్వీకరిస్తారని ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లా రావు గురువారం చెప్పారు.
సామాజిక సంఘ సంస్కర్త అన్నా హజారే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారనే అంశం పైనా పత్తిపాటి స్పందించారు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల మనోభావాలకు వ్యతిరేకంగా అన్నా హజారే, మేథాపట్కర్ లాంటివారి కూడా మాట్లాడలేరు కదా అన్నారు. అంతా అయ్యాక హజారే వస్తే ఏమి లాభమన్నారు.
కాగా, రాజధాని ప్రాంతంలో ఇటీవల మేథాపట్కర్ సందర్శించారు. మరోవైపు, భూసేకరణ అంశంపై అన్నా హజారే ఏపీ సీఎంకు లేఖ రాసినట్లుగా వార్తలు వచ్చాయి.

అన్నా హజారే ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్లుగా ప్రముఖ తెలుగు దినపత్రిక సాక్షిలో వచ్చింది. రాజధాని భూసమీకరణ పైన చంద్రబాబుకు హజారే ఘాటైన లేఖ రాశారని అందులో పేర్కొన్నారు. పత్రికలో వచ్చిన దాని ప్రకారం....
రెండు మూడు పంటలు పండే భూముల్లో రాజధానిని నిర్మిస్తారా, ఇది దేశ ఆహారభద్రతకు పెనుముప్పుగా పరిణమించదా అని హజారే ప్రశ్నించారు. రైతులు భయపడి భూములు ఇచ్చినట్లుగా తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయయోగ్యం కాని భూముల్లో రాజధానిని నిర్మించాలని సూచించారు. శివరామకృష్ణన్ కమిటీ సూచనలు పాటించాలన్నారు. త్వరలో తాను రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని అందులో పేర్కొన్నారని వచ్చింది.












Click it and Unblock the Notifications