జగన్ ఏ పత్రాలు తెచ్చారో, ఏం మ్యాజిక్ చేస్తున్నారో: పత్తిపాటి కౌంటర్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలకు మంత్రి పత్తిపాటి పుల్లారావు శుక్రవారం విజయవాడలో స్పందించారు.

బోఫోర్స్, కోల్ స్కాంల కంటే పెద్దది.. ఇదిగో సాక్ష్యం, లోకేష్ హస్తం: జగన్ సంచలనం

జగన్ ఏ పత్రాలు తెస్తున్నారో, ఏం మ్యాజిక్ చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. అగ్రిగోల్డ్‌‌కు సంబంధం లేని ఆస్తులను కూడా కొన్నట్లు చూపిస్తున్నారని మండిపడ్డారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు నకిలీ పత్రాలు చూపించడం ఓ అలవాటుగా మారిందన్నారు. తనకు అగ్రిగోల్డ్‌తో ఎటువంటి సంబంధం లేదన్నారు. తనపై చేసిన ఆరోపణలను జగన్ నిరూపించలేకపోయారన్నారు.

Minister Pattipati counter to YS Jagan allegations

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. ఐటీ రిట‌ర్న్స్ ప్ర‌కార‌మే తాను భూముల‌ను కొన్నానని, ఆ భూముల‌పై ఎన్నో అవాస్త‌వాలు, అస‌త్యాలను ప్ర‌చారం చేస్తూ త‌న‌ను త‌న కుటుంబాన్ని బ‌జారుకీడ్చడం జ‌గ‌న్‌కు తగదన్నారు.

ఉద‌య్ దిన‌క‌ర‌న్ ఆ సంస్థ‌కు డైరెక్ట‌ర్ మా‌త్ర‌మేన‌ని, దిన‌క‌ర‌న్ ఎక‌రాను రూ.3 ల‌క్ష‌ల‌కు కొని, త‌మ‌ కంపెనీకి రూ.4 ల‌క్ష‌లకు అమ్మారని చెప్పారు. తాను రైతుల నుంచి కూడా నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే భూములు కొన్నాన‌ని తెలిపారు.

20 ని.లు టైమిస్తే ఆధారాలు, లేదంటే బయటకెళ్లి చెప్తా: బాబుకు జగన్ హెచ్చరిక

వాటిపైనే ప్ర‌తిప‌క్ష స‌భ్యులు అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నార‌న్నారు. తాను ముగ్గురు రైతుల వద్ద 14 ఎకరాలు కొనుగోలు చేశానని చెప్పారు. తన క్యారెక్టర్ ఏమిటో ప్రజలకు తెలుసునని చెప్పారు. ఆరోపణలను రుజువు చేయలేక జగన్ సభ నుంచి పారిపోతున్నారన్నారు.

వారు అవాస్తవాలు, ఆరోపణలు చేస్తున్నా సీఎం చంద్రబాబు వారి ఆరోపణలపై న్యాయ విచారణకు అంగీకరించారని, అయితే జగన్ మాత్రం పారిపోయాడన్నారు. హాయ్ లాండ్‌ను వేలానికి తీసుకు రమ్మని కోరింది మొదట చంద్రబాబేని, దానిపై కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Pattipati Pulla Rao counter to YSR Congress Party chief YS Jaganmohan Reddy allegations.
Please Wait while comments are loading...