'జగన్‌కు ఏడుపెందుకు, స్విస్ ఛాలెంజ్‌పై అప్పీల్‌కు, వెనుక ఎవరున్నారో'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి పత్తిపాటి పుల్లారావు సోమవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభలో వైసిపి తీరుతో అసెంబ్లీ గౌరవం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, ఏపీకి వీఐపీ హోదా: బీజేపీ కొత్త ట్విస్ట్‌లు, పవన్ దెబ్బకి దిగొచ్చిన 'బీజేపీ'!
స్విస్ ఛాలెంజ్ విధానం పైన హైకోర్టు స్టే ఇచ్చిందని, ఈ విషయమై అప్పీల్‌కు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. స్విస్ ఛాలెంజ్ విధానం పైన కోర్టుకు వెళ్లిన వారి వెనుక ఎవరున్నారో తెలియాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షం అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా పంట రక్షణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైతులకు మేలు జరుగుతుంటే ప్రతిపక్షాలకు ఏడుపు ఎందుకని ప్రశ్నించారు. రెయిన్ గన్‌ల వల్ల రైతులలో భరోసా కలిగిందన్నారు.
ప్రజలకు మేలు జరుగుతున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. రెయిన్ గన్ల పైన కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. రెయిన్ గన్‌లకు అయిన ఖర్చు కంటే రెండింతలు చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: సుజన అలా, వెంకయ్య ఇలా, బాబుకు తెలిసే
రెయిన్ గన్లకు రూ.268 కోట్లు కాలేదని, రూ.103 కోట్లతో 4.7 లక్షళ ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు. ప్రత్యేక హోదా పైన అసెంబ్లీలో చర్చ జరగకుండా చేసి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు ఉపేక్షించరన్నారు.












Click it and Unblock the Notifications