బంగారం నిర్ణయంపై పత్తిపాటి ఆగ్రహం, 'జగన్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు'

బంగారం పైన కేంద్రం నిర్ణయం సరికాదని మంత్రి పత్తిపాటి పుల్లారావు శుక్రవారం అన్నారు. బంగారంపై కేంద్రం తీరు తేనె తుట్టెపై రాయి వేసినట్లుగా ఉందన్నారు.

విజయవాడ: బంగారం పైన కేంద్రం నిర్ణయం సరికాదని మంత్రి పత్తిపాటి పుల్లారావు శుక్రవారం అన్నారు. బంగారంపై కేంద్రం తీరు తేనె తుట్టెపై రాయి వేసినట్లుగా ఉందన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయారన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి జగన్ సైంధవుడిలా తయారయ్యారని ధ్వజమెత్తారు. భూములను ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తుంటే జగన్ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

pattipati pulla rao

అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం: బోండా ఉమ

ప్రతి అభివృద్ధి పథకాన్ని వైయస్ జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శించారు. ప్రజల మనసుల్లో విషబీజాలు నాటుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ బందర్‌లో మతిస్థిమితం కోల్పోయినట్లుగా మాట్లాడారన్నారు.

అభివృద్ధిలో ఏపీ ముందుకు వెళ్తే తన మనుగడకే కష్టమవుతుందని, తొలి నుంచి ఏపీలో జరిగే ప్రతి కార్యక్రమానికి జగన్ అడ్డంకిగా మారారన్నారు. జగన్ నిరాశా, నిష్పృహలలో ఉన్నారని, ఇప్పటికే వైసీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారని, మరికొంతమంది బయటకు వచ్చే అవకాశముందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+