జగన్‌ది దుర్మార్గం, బాబుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు: పత్తిపాటి ఫైర్
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్ పార్టీ మరో దుర్మార్గమైన చర్యకు పూనుకుందని మండిపడ్డారు.
ఏపీ రాజధానికి 98 శాతం మంది రైతులు భూములు ఇచ్చినా.. కేవలం రెండు శాతం మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులతో ప్రపంచ బ్యాంకుకు తప్పుడు ఈ-మెయిల్స్ పంపించారని అన్నారు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్న ఇమేజ్‌ను ఎవరూ చెరపలేరని స్పష్టం చేశారు.

నంద్యాల ఉప ఎన్నికలో తెలుగు దేశం పార్టీదే గెలుపని.. జగన్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదన్నారు. గురువారం ఆయన చిలకలూరిపేట పురుషోత్తపట్నం వద్ద ఉన్న ఏపీ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
Recommended Video

విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సన్న బియ్యంతో భోజనం పెట్టాలని సూచించారు. పేదవాడి పరిస్థితి మారాలంటే విద్య ఒక్కటే మార్గమని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తోందని.. అందుకే బడ్జెట్లో రూ. 22 వేల కోట్లు కేటాయించారని తెలిపారు.












Click it and Unblock the Notifications