Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ అనూహ్య స్పందన - ఏమిచ్చారు, ఏం జరుగుతోంది..!!

Union Budget 2025: కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు చేసారు. ఆదాయపు పన్ను పరిమితి రూ 12 లక్షలకు పెంచారు. మిత్రపక్షం అధికారంలో ఉన్న బీహార్ కు ఎన్నికల వేళ భారీ వరాలు ప్రకటించారు. కానీ, ఏపీకి నామమాత్రపు కేటాయింపులు చేసినట్లు కనిపిస్తోంది. దీంతో, బడ్జెట్ పైన టీడీపీ స్పందించింది. ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.

ఏపీకి కేటాయింపులపై
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి చెప్పుకునే స్థాయిలో కేటాయింపులు లేవనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ ఇప్పటికే బీహార్ కు ప్రాధాన్యత ఇచ్చిన మోదీ.. ఏపీకి ఎందుకు మొండిచేయి ఇచ్చారని ప్రశ్నలు సంధిస్తోంది. ఎన్నికలు జరగనున్న బీహార్ కు కేంద్రం భారీ వరాలు ప్రకటించింది. దీంతో, బడ్జెట్ పైన టీడీపీ స్పందించింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బడ్జెట్ ను అభినందించారు. గత
గత ఏడు నెలలుగా రాష్ట్రంలోని సమస్యలపై కేంద్రానికి చంద్రబాబు వివరించారని.. వాటికి కేంద్ర బడ్జెట్ ద్వారా పరిష్కారం చూపించిందని చెప్పుకొచ్చారు. జలజీవన్ మిషన్ ను పొడిగించారని చెప్పారు. మాన్యుఫాక్చర్ రంగంలో ఏపీకి మేలు జరగనుందని వివరించారు.

Minister Ram Mohan Naidu and MP s reacts over Budget allocations in Union Budget 2025-26

ఏపీకి ప్రాధాన్యత ఇస్తారు
ఉడాన్ స్కీం లో కీలక నిర్ణయం తీసుకున్నారని రామ్మోహన్ నాయుడు చెప్పారు. సివిల్ ఏవియే షన్ రంగంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. ఉడాన్ స్కీం 120 కొత్త డెస్టినేషన్ లకు కనెక్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు సైతం బడ్జెట్ ను ప్రశంసించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలిపారు. గడిచిన 7 నెలల్లో అమరావతికి 15 వేల కోట్లు..విశాఖ స్టీల్ ప్లాంట్ కు 16440 కోట్లు కేంద్రం ఇచ్చిందని గుర్తు చేసారు. పోలవరం కోసం 12 వేల కోట్లు ఇవ్వనున్నారని చెప్పుకొచ్చారు. వ్యవసాయం, సామాన్యుడికి, ఎంఎస్ఎంఈ లకు కేటాయింపులు జరిగాయని చెప్పారు. రైతులు, సీ ఫుడ్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏపి కావటంతో లాభం జరుగుతుందన్నారు.

ఏం జరుగుతోంది
రాయలసీమకు ఉపయోగపడే నిర్ణయాలు బడ్జెట్ లో ఉన్నాయని లావు పేర్కొన్నారు. జల జీవన్ మిషన్ ను ఏపీలో పొడిగించాలని కోరామని.. 2028 వరకు పొడిగించారని వివరించారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ ద్వారా టూ టైర్, త్రీ టైర్ నగరాలకు నిధులు రానున్నాయని చెప్పుకొచ్చారు. ఇక,క్యాన్సర్ కు సంబంధించిన 36 మందుల పై టాక్స్ తగ్గించిన విషయాన్ని గుర్తు చేసారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నామని.. బడ్జెట్ సింహ భాగం ఏపి కి దక్కుతుందని విశ్లేషించారు. అయితే, బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు లేకపోవటం పైన రాజకీయంగా విమర్శలు కొనసాగుతున్నాయి. అసలు ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+