పెట్టుబడులపై కుట్ర, ఆధారాలు: తెలంగాణ ప్రభుత్వంపై రావెల సంచలనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
కొన్ని కంపెనీలకు ఇందుకు సంబంధించి ఈ మెయిల్స్ పెడుతున్నాయన్నారు. వీటికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బాంబు పేల్చారు. తమ ప్రభుత్వం దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉందని రావెల చెప్పారు.
ఎల్లుండి చంద్రన్న చేయూత పథకం
చంద్రన్న చేయూత పథకాన్ని ప్రభుత్వం శనివారం నాడు ప్రారంభించనుంది. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ, ఉపాధి కల్పన ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని ప్రభుత్వం చెబుతోంది.

ఎస్సీ కార్పోరేషన్ నుంచి రూ.20 కోట్లు ఈ పథకానికి కేటాయించారు. ఈ కార్యక్రమంపై ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
రైతు బజార్లో పత్తిపాటి తనిఖీలు
స్వరాజ్య మైదాన్లోని రైతు బజార్‌ను మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆకస్మికంగా గురువారం నాడు తనిఖీలు చేశారు. ఉల్లిపాయల కొనుగోలు కేంద్రంలో వినియోగదారుల నుంచి ధరల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు బజార్లలో దళారీల వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వినియోగదారుల నుంచి ఎవరైనా అధిక ధరలను వసూలు చేస్తే సహించేది లేదన్నారు.
ఆధునిక వ్యవసాయ పద్ధతుల పైన అవగాహనకు గ్రీన్ డిజిటల్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇక్రిశాట్ సాయంతో ప్రయోగాత్మకంగా పంటల సాగును పరిశీలిస్తామన్నారు. ప్రతి జిల్లాలో 10వేల ఎకరాలలో పంటల సాగు చేస్తామన్నారు. రాయితీపై రైతులకు సోలార్ పంప్ సెట్లు ఇస్తామన్నారు.
రావెల, టి సర్కార్ పెట్టుబడులు డ్డుకుంటోంది, కోన్ని కంపెనీలకు మెయిల్స్ పెడుతున్నార, మా వద్ద ఆధారాలు, దళితుల అభఇవృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.












Click it and Unblock the Notifications