ఉండవల్లి శ్రీదేవి ప్రాణాలు నాడు జగన్ కాపాడారు - దమ్ముందా : మంత్రి రోజా..!!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురి పైన మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ఒక్క ఎమ్మెల్సీ స్థానం గెలిచి ఏదో సాధించామని సంబర పడుతున్నారంటూ టీడీపీ నేతల పైన మండిపడ్డారు. చంద్రబాబు నీచ రాజకీయాల గురించి తాము పదే పదే చెబుతూనే ఉన్నామని రోజా వ్యాఖ్యానించారు. ఎంత సీనియర్ లీడర్ అయినా, గత ఎన్నికల్లో జగన్ వలనే గెలుపొందారని రోజా చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి రోజా సవాల్ చేసారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసారంటూ నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ ఎమ్మెల్యేలు మాత్రం తాము క్రాస్ ఓటింగ్ చేసామని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. తాము పార్టీ చెప్పిన అభ్యర్దులకే ఓటు వేసామని చెప్పుకొస్తున్నారు. వైసీపీ నేతలు తాము పూర్తి సమాచారంతో మాట్లాడుతున్నామని క్లారిటీ ఇస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి రోజా ఆ నలుగురు ఎమ్మెల్యేల పైన ఫైర్ అయ్యారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆ నలుగురు ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేయాలని రోజా సవాల్ విసిరారు. ఉండవల్లి శ్రీదేవిని కోవిడ్ సమయంలో స్పెషల్ ఫ్లైట్ పెట్టి సీఎం జగన్ ప్రాణాలు కాపాడితే.. ఈ రోజు ఆయన నుండే ప్రాణహాని ఉందని చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు నీచ రాజకీయాలు అర్థం అవుతున్నాయన్నారు. హైదరాబాద్ లో ఉండే డాక్టర్ ని తీసుకువచ్చి అమరావతిలో గెలిపిస్తే ఈరోజు పార్టీకి ద్రోహం చేసిందంటూ ఫైర్ అయ్యారు. ఎంత పెద్ద డాక్టర్ అయినా.. ఎంత సీనియర్ లీడర్ అయినా.. సరే.. గత ఎన్నికల్లో సీఎం వైయస్ జగన్ వల్లే గెలుపొందారని గుర్తు చేశారు. దమ్ముంటే.. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆ నలుగురు ఎమ్మేల్యేలు రాజీనామా చేసి మీకు నచ్చిన పార్టీ నుంచి పోటీ చేస్తే.. ఎవరి బలం ఏంటో తేలిపోతుంది అంటూ మంత్రి రోజా చాలెంజ్ చేశారు. శ్రీదేవి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినట్లు అనిపిస్తోందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలపై పలువురు మంత్రులు మండిపడ్డారు.
గతంలో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకు పట్టిన గతే ఇప్పుడు అమ్ముడుబోయిన వారికీ పడుతుందన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినట్లు అనిపిస్తోందని మంత్రి వనిత వ్యాఖ్యానించారు. శ్రీదేవికి వైయస్ఆర్‌సీపీ చాలా గౌరవం, గుర్తింపు ఇచ్చిందని గుర్తుచేశారు. మొన్నటి వరకూ సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేసిన వారి పక్షానే శ్రీదేవి చేరారని ఎద్దేవా చేశారు. అమరావతిని రాజధానిగా ఉంచడానికి ప్రయత్నిస్తానని శ్రీదేవి చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆమె తెలంగాణ వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications