కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్న టీడీపీ?
అన్న క్యాంటిన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ కోడిగుడ్డుమీద ఈకలు పీకే రాజకీయం చేస్తోందని మంత్రి రోజా మండిపడ్డారు. అవసరంలేని విషయాలపై అనవసర రాజకీయాలు చేస్తోందన్నారు. గుంటూరు నగరంలోని గుంటూరువారితోటలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నెలరోజుల నుంచి రాజకీయం చేస్తోందని, తప్పుడు ఆరోపణలు చేస్తే మీరే ఫూల్స్ అవుతారనే విషయాన్ని గుర్తంచుకోవాలన్నారు.
టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌పై ఆ పార్టీ నేతలకు నిజంగా ప్రేమ ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాంటిన్లను ఏర్పాటు చేసేవారని, అలా చేయకుండా వైసీపీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎన్నికలకు నాలుగు నెలలు ముందగా నాలుగు అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసి మేం పెట్టాం.. మీరు తీసేశారంటూ వైసీపీ విమర్శించడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.

వైసీపీని విమర్శిస్తూ టీడీపీ పబ్బం గడుపుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఆదరించరని, వారి నమ్మకాన్ని చంద్రబాబు కోల్పోయారని రోజా అన్నారు.
అన్న క్యాంటిన్లను ఏర్పాటు చేయాలనే నిజమైన ప్రేమ తెలుగుదేశం పార్టీ నేతలకు ఉంటే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయేవారు కాదని రోజా అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఒక్కరే ప్రజలకు మేలు చేయగలరని, పేదల కోసం తప్పించే పార్టీ వైసీపీ ఒక్కటేననే విషయాన్ని తాను సగర్వంగా చెబతానన్నారు. కుప్పంలో అన్న క్యాంటిన్ వ్యవహారంలో తప్పు ఎవరిదనే విషయం అందరికీ తెలుసని, జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తుంచుకోవాలన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మరోసారి బాబు అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందన్నారు.












Click it and Unblock the Notifications