వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమలలో మంత్రి రోజా తీరుపై : అనుచరులతో కలిసి - చెప్పుకుంటే బాధ అంటూ..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ మంత్రులు ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయటం లేదు. తాజాగా మంత్రి రోజా తిరుమల కేంద్రంగా విమర్శలకు కారణమయ్యారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలతో తమ పవర్ నిరూపించుకొనేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న టీటీడీ మంత్రులు వస్తే మాత్రం నో చెప్పలేకపోతోంది. మంత్రుల డిమాండ్ కు తలొగ్గుతోంది. వారికి కావాల్సినన్ని బ్రేక్ టిక్కెట్లు కేటాయిస్తోంది.

తీరని మంత్రుల తీరు

తీరని మంత్రుల తీరు

వరుసగా మంత్రులు అప్పలరాజు.. ఉషశ్రీ చరణ్ భక్తుల రద్దీ సమయంలో తమ అనుచరులతో కలిసి ప్రోటోకాల్ - వీఐపీ దర్శనాల తీరు వివాదాస్పదమైంది. ఆగస్టు 15న మంత్రి ఉషశ్రీ చరణ్ తన నియోకవర్గానికి చెందిన వారితో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ా సమయంలో కొండ మొత్తం భక్తులతో రద్దీగా ఉంది. దర్శనానికి 30 గంటల వరకు సమయం పడుతోంది. అయినా..తన అనుచరగణానికి మంత్రి దర్శనంలో ప్రాధాన్యత దక్కేలా పవర్ చూపించారు. ఇక, ఇప్పుడు మరో మంత్రి రోజా సైతం ఇటువంటి విమర్శలకే కారణమయ్యారు. పెళ్లిళ్ల సీజన్ ..సెలవులు ఎక్కవగా ఉండటంతో భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగా ఉంది.

టీటీడీ చెప్పేదొకటి.. చేసేది మరొకటి

టీటీడీ చెప్పేదొకటి.. చేసేది మరొకటి


గదులు దొరకటం కష్టంగా మారింది. చాలా మంది భక్తులు.. దర్శనం కసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. రద్దీ కారణంగా ఈ నెల 21వ తేదీ వరకు వీఐపీ సిఫార్సు లేఖలు అనుమతించటం లేదని.. బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లుగా ఇప్పటికే టీటీడీ ప్రకటించింది. అయితే, ఈ ఉదయం మంత్రి రోజా 30 మంది అనుచరులతో కలిసి దర్శనానికి వెళ్లారు. అందులో పది మందికి టీటీడీ ప్రోటోకాల్ దర్శనం....మరో 20 మందికి బ్రేక్ దర్శనం అవకాశం కల్పించారు. తనతో పాటుగా వచ్చిన అనుచరులు దర్శనం పూర్తి చేసుకొనే వరకూ మంత్రి రోజా ఆలయ ప్రాంగణంలోనే ఉన్నారు.

మంత్రి రోజా అనుచరులతో కలిసి

మంత్రి రోజా అనుచరులతో కలిసి


ఒక వైపు 21వ తేదీ వరకు వీఐపీ దర్శనాలు.. సిఫార్సు లేఖతో బ్రేకు దర్శనాలు లేవని చెప్పిన టీటీడీ.. ఇప్పుడు మంత్రులతో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వటం పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము గంటల తరబడి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి చూస్తుంటే మంత్రితో వచ్చిన అనుచరులకు ఎలా ప్రాధాన్యత ఇస్తారంటూ మండిపడుతున్నారు. కానీ, మంత్రి రోజా దీని పైన స్పందించారు. చెప్పుకుంటే బాధ అంటూ టీటీడీపై ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ నిర్ణయాన్ని గౌరవించాలి కనుక... తన నియోజకవర్గ ప్రజలకు దర్శనం అయ్యే వరకు ఆలయంలోనే ఉన్నానని మంత్రి రోజా చెప్పారు.

English summary
Minister Roja visit Tirumala with followers became controversy, common devotees waiting for Sri vari darshan in que lines. TTD giving priority for Ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X