నారా బ్రాహ్మణికి మంత్రి రోజా సీరియస్ వార్నింగ్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఊహించని విధంగా తెరమీదకు వచ్చిన నారా బ్రాహ్మణి, భువనేశ్వరి వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును ఇరికించారని విమర్శలు గుప్పిస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై, వైసిపి పాలనపై తమదైన శైలిలో బ్రాహ్మణి, భువనేశ్వరి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో బ్రాహ్మణి, భువనేశ్వరి లను వైసీపీ మంత్రులు నేతలు టార్గెట్ చేస్తున్నారు.

తాజాగా మంత్రి ఆర్కే రోజా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొరికిపోయిన చంద్రబాబు జైల్లో కూర్చుంటే కనీసం సిగ్గు లేకుండా చంద్రబాబు భార్య, ఆయన కోడలు, గంట కొట్టండి, విజిల్స్ వేయండి .. సీఎం జగన్ కు బుద్ధి చెప్పండి అంటున్నారని మండిపడ్డారు.

Minister Roja gives serious warning to Nara Brahmani!!

నారా బ్రాహ్మణి తెలియక మాట్లాడుతుందో తెలిసి అబద్ధాలు ట్వీట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు అంటూ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించారా అంటూ రోజా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకోలు ఎవరైనా ఉంటే అది మీ నాన్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మీ మామ నారా చంద్రబాబు నాయుడు మాత్రమే అంటూ రోజా తీవ్రవ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకోసారి మాట్లాడితే మర్యాద దక్కదని రోజా హెచ్చరికలు జారీ చేశారు. ఇన్ని రోజులు బ్రాహ్మణి రాజకీయం చేయలేదు కాబట్టి తాను మాట్లాడలేదని, ఇప్పుడు అసత్య ట్వీట్లు చేస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నానని మంత్రి రోజా మండిపడ్డారు. రాజకీయాల్లో 45 ఏళ్ల ఇండస్ట్రీ అని పబ్లిసిటీ చేసుకునే చంద్రబాబు ప్రజల కోసం చేసింది ఏమీ లేదని రోజా మండిపడ్డారు.

మీ నాన్న, మీ మామకు అడ్రస్ కల్పించి సమాజంలో గౌరవాన్ని అందించిన మీ తాత ఎన్టీ రామారావు గారి పై చెప్పులు వేసి, ఆయనను వెన్నుపోటు పొడిచి, ఆయన పార్టీని లాక్కుని, చివరికి ఆయన చావుకు కారణమైన పెద్ద సైకోలు ఎవరంటే అది బాలకృష్ణ, చంద్రబాబు అని చిన్నపిల్లలను అడిగినా చెబుతారు అంటూ మంత్రి రోజా టార్గెట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+