మంత్రి రోజా స్పిరిట్యువల్ టూర్ : మొక్కులు చెల్లిస్తూ..!!

ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా ఆధ్మాత్మిక టూర్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో దేవాలయాలను సందర్శిస్తున్నారు. వరుసగా తమిళనాడు - ఏపీలోని ప్రముఖ దేవాలయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు. తొలి నుంచి భక్తి భావం ఎక్కువగా కనిపించే రోజా..ఈ మధ్య కాలంలో మొక్కులు అన్నీ తీర్చేసుకుంటున్నారు. తాజాగా.. తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆడికృత్తికను పురస్కరించుకొని పుష్ప కావడిలతో తన మొక్కు తీర్చుకున్నారు.

ఎక్కువగా తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకొనే మంత్రి రోజా..కొద్ది రోజుల క్రితం కొల్హాపూర్ లో మహాలక్ష్మీ అమ్మవారిని సైతం దర్శించుకున్నారు. 18 శక్తీ పీఠాల్లో ఏడవదిగా చెప్పుకొనే ఈ పీఠం శక్తివంతమైనది. తన సొంత నియోజకవర్గంలో ప్రస్తుతం రోజా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే కొందరు మంత్రి రోజాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. అనూహ్యంగా మంత్రిగా అవకాశం దక్కించుకున్న రోజా.. ఇప్పుడు తన కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య క్షేత్రాలు సందర్శించటం ఆసక్తి కరంగా మారింది.

Minister Roja in spiritual tour, visit Tiruttani Temple along with family members

తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రోజా కావడి మొక్కు తీర్చుకొనేందుకు వచ్చినట్లు ఆలయ అధికారులు చెప్పుకొచ్చారు. సుబ్రమణ్యేశ్వర స్వామికి ఆలయంలో వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోజా తిరుత్తణి దేవాలయంలో మొక్కు చెల్లింపు ఫొటోలు ఇప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+