పవన్ పై అందుకే విషం చిమ్ముతున్నారు- మంత్రి రోజా సంచలనం..!!

ఆ భయంతోనే పవన్ కళ్యాణ్ ఎక్కడ హీరో అవుతాడనే భయంతో పవన్ కళ్యాణ్‌ పై విషం చిమ్ముతున్నారని మంత్రి రోజా సీరియస్ కామెంట్స్ చేసారు.

టీడీపీ నేత నారా లోకేష్ ఇప్పుడు వైసీపీ నేతలకు రాజకీయంగా టార్గెట్ అయ్యారు. లోకేష్ తన పాదయాత్రలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీని పైన ఇప్పటికే వైసీపీ నేతలు మాజీ మంత్రి కొడాలి నాని..వల్లభనేని వంశీ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ తాత పార్టీలోకి లోకేష్ ఇప్పుడు తారక్ ను ఆహ్వానించటం ఏంటని ఎద్దేవా చేసారు. లోకేష్ పార్టీ నడపలేకనే జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ అప్పగిస్తే కొంత కాలం టీడీపీ మనుగడలో ఉంటుందని పేర్కొన్నారు. తాజాగా మంత్రి రోజా ఇదే అంశం పైన స్పందించారు. చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర పైన మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేసారు.

లోకేష్ వ్యాఖ్యలపై రోజా ఆగ్రహం

లోకేష్ వ్యాఖ్యలపై రోజా ఆగ్రహం


ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తిరుపతిలో పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపు బాధ్యతను ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు అప్పగించారు. మంత్రి పెద్దిరెడ్డి, నారాయణ స్వామితో పాటుగా రీజనల్ ఇంఛార్జ్ బాలినేని హాజరయ్యారు. ఎన్నికల కోసం సమాయత్తం పై చర్చించారు. ఇదే సమయంలో లోకేష్ పైన మంత్రి రోజా మండిపడ్డారు. టీడీపీలో మంత్రులను చంద్రబాబు పపెట్‌లా ఆడించారని చెప్పిన మంత్రి..జగన్ తన మంత్రులను సొంత మనుషుల్లా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. అభివృద్ధిపై చర్చకు తాము సిద్దమేనని స్పష్టం చేసారు. నలుగురి కోసం మాట్లాడి చప్పట్లు కొట్టించుకోవటం ద్వారా ప్రయోజనం లేదన్నారు.

ఆ భయంతో పవన్ కళ్యాణ్‌ పై విషం

ఆ భయంతో పవన్ కళ్యాణ్‌ పై విషం


ఎలాంటి ఛాలెంజ్‌కైనా రెడీగా ఉన్నామని రోజా చెప్పారు. లోకేష్ ది యువగళం కాదని..గంగాళమంటూ రోజా వ్యాఖ్యానించారు.లోకేష్ పైన మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేసారు. టీడీపీ చంద్రబాబుది కాదని..ఎన్టీఆర్ పార్టీగా పేర్కొన్నారు. పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప ఇక పార్టీ బతికేది లేదని చంద్రబాబు - లోకేష్ కు అర్దం అయిందన్నారు. లోకేష్ పాదయాత్ర ఫెయిల్ అయిందని రోజా వ్యాఖ్యానించారు. దీంతో, ఇక వారాహితో పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వస్తే ఎక్కడ హీరో అవుతాడనే భయంతో పవన్ కళ్యాణ్‌ పై విషం చిమ్ముతున్నారని మంత్రి రోజా సీరియస్ కామెంట్స్ చేసారు. లోకేష్ తన స్థాయి మరిచి మాట్లాతున్నారని ఫైర్ అయ్యారు. అసలు మంత్రి పెద్దిరెడ్డి కన్నెర్ర చేస్తే లోకేష్ చిత్తూరు జిల్లాలో తిరుగుతారా అని రోజా కీలక వ్యాఖ్యలు చేసారు.

లోకేష్ ఆరోపణలు నిరూపించాలి

లోకేష్ ఆరోపణలు నిరూపించాలి


చంద్రబాబు..లోకేష్ ఇద్దరూ దమ్ముంటే చిత్తూరులో పోటీ చేయాలని రోజా సవాల్ చేసారు. నియోజకవర్గాల్లోకి వచ్చి తాటా తీస్తానని లోకేష్ మాట్లాడుతున్నారని...అవినీతి చేసామని విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. లోకేష్ తమ మీద చేసిన ఆరోపణల పైన దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేసారు. చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాలకు టీడీపీకి ఇంఛార్జ్ లు లేరన్నారు. లోకేష్ పాదయాత్రకు జనం లేరని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. ఇప్పుడు మంత్రి రోజా వ్యాఖ్యల పైన లోకేష్..టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+