నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మంత్రి రోజా సెటైర్లు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. చంద్రబాబు జైలుకు వెళ్లడంతో ఊహించని విధంగా తెరమీదకు వచ్చారు నారా భువనేశ్వరి. ఇక తాజాగా నారా భువనేశ్వరి వైసిపి ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీంతో భువనేశ్వరి టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. నిజం గెలవాలి అని యాత్ర చెయ్యనున్న నారా భువనేశ్వరిపై వైసిపి మంత్రి రోజా టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.
నారా భువనేశ్వరి తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని నిజం గెలవాలి అంటూ యాత్ర చేపడుతున్నారని, నిజంగానే నిజం గెలవాలని నారా భువనేశ్వరి శ్రీవారిని కోరుకున్నారని, అలా అయితే చంద్రబాబు జీవిత కాలం జైల్లోనే ఉంటారంటూ వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరి గట్టిగా నిజం గెలవాలని దేవుడికి పూజలు చేశారని, తాము కూడా నిజమే గెలవాలని కోరుకుంటున్నామని రోజా వ్యాఖ్యానించారు.

నిజం గెలవాలని మనస్పూర్తిగా నారా భువనేశ్వరికి ఉంటే సిపిఐ ఎంక్వయిరీ కోరితే నిజం కచ్చితంగా గెలుస్తుందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. నిజమే గెలిస్తే చంద్రబాబుతో పాటు లోకేష్, భువనేశ్వరి కూడా జైల్లోనే ఉంటారు అంటూ మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు. సిబిఐ ఎంక్వయిరీ భువనేశ్వరి కోరాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు.
ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పై నిజం గెలవాలని సిబిఐ ఎంక్వయిరీ వేసుకుంటే హెరిటేజ్ లో ఎవరెవరున్నారో అందరూ బయటకు వస్తారని రోజా అభిప్రాయపడ్డారు.నారా భువనేశ్వరి యాత్ర చేసే పరిస్థితి లేదని, లోకేష్ యువ గళం పాదయాత్రకు మంగళం పాడారని మంత్రి రోజా కామెంట్స్ చేశారు .ఫ్యాషన్ షో లకు వెళ్ళినట్టు, ప్రజల కోసం వీళ్ళు రోడ్డు మీదకు రాలేరని మంత్రి రోజా కామెంట్స్ చేశారు.
ప్రజలు లోకేష్, పవన్ కళ్యాణ్ ని ఛీ కొట్టి ఓడించారని గుర్తు చేసిన రోజా భువనేశ్వరి గతంలో తండ్రి పైన చెప్పులు వేసినప్పుడే, తండ్రి పార్టీ లాక్కున్నప్పుడే, తండ్రి చావుకు కారణమైన అప్పుడే వీళ్ళు హ్యాపీగా ఉన్నారని, అటువంటి వాళ్లకు ఇప్పుడు ఎక్కడ నుంచి బాధ వస్తుందంటూ విమర్శించారు.
ఇలాంటి వాళ్లు రాష్ట్ర ప్రజల కోసం ఏం కష్టపడగలరు అంటూ రోజా నిలదీశారు. ఏపీ కోసం మీరు ఏమి చేయలేరు అంటూ రోజా మండిపడ్డారు. భువనేశ్వరి కోరుకుంటున్న నిజం గెలవాలి అనేది వాళ్ళ ఆయన లోపలే ఉండాలని అనే విధంగా ఉందని రోజా వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications