జగన్‌కు మరో షాక్.. కడప జిల్లా పేరు మార్పు..?
గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. నేతలు వరుస పెట్టి పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మరోవైపు కీలక నేతలను ప్రభుత్వం కేసులతో ఇబ్బంది పెడుతోంది. ఇవన్నీ చాలవన్నట్టు ప్రకాశం బ్యారేజీ దగ్గర బొట్ల కేసు, శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంతో వైసీపీ అధినేత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటువంటి తరుణంలో జగన్‌కు మరో షాక్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. వైఎస్సార్ జిల్లా పేరును మార్చడానికి రంగం సిద్ధమవుతోంది.
ఈక్రమంలోనే బీజేపీ మంత్రి సత్యకుమార్ సీఎం చంద్రబాబు ముందుకు కీలక ప్రతిపాదన తీసుకువచ్చారు. వైఎస్సార్ పేరును తొలగించి కడప జిల్లాగా మార్చాలని మంత్రి సత్యకుమార్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ లేఖలో కడప జిల్లా ప్రాముఖ్యతతో పాటు, జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు. కలియుగదైవం వేంకటేశ్వరుడి సన్నిధికి చేరడానికి తొలిగడప కడప. కడప పేరుకు ఒక చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్నాయి. వీటి పట్ల కనీస అవగాహన లేని మాజీ సీఎం జగన్ పేర్ల పిచ్చితో జిల్లా పేరును 'వైఎస్సార్' జిల్లాగా మార్చడం తప్పు.

అందుకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబుని కడప జిల్లా ప్రజల మనోభావాల మేరకు జిల్లా పేరుని గెజిట్ లో మార్పులు చేసి గతంలో జరిగిన తప్పును సరిదిద్దాల్సిందిగా కోరాను. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడప జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. కాబట్టి కడప చారిత్రక నేపథ్యాన్ని, డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నేడు వైయస్సార్ జిల్లాగా పిలవబడుతున్న ఈ జిల్లాను "వైఎస్సార్ కడప" జిల్లాగా మార్చవలెనని మనవి చేసుకుంటున్నాను." అని లేఖలో ప్రస్తావించారు.
కలియుగదైవం వేంకటేశ్వరుడి సన్నిధికి చేరడానికి తొలిగడప కడప. కడప పేరుకు ఒక చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్నాయి. వీటి పట్ల కనీస అవగాహన లేని మాజీ సీఎం @ysjagan పేర్ల పిచ్చితో జిల్లా పేరును ‘వైఎస్సార్’ జిల్లాగా మార్చడం తప్పు.
— Satya Kumar Yadav (@satyakumar_y) October 4, 2024
అందుకే గౌరవ ముఖ్యమంత్రి @ncbn గారిని కడప… pic.twitter.com/aKg83mygux
అయితే మంత్రి సత్యకుమార్ తీరును వైసీపీ తప్పుపడుతోంది. కడప జిల్లాను వైఎస్సార్ జిల్లాగా మార్చింది తాము కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని మంత్రి సత్యకుమార్‌కు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైఎస్సార్ మరణం తర్వాత ఆయన సేవలకు ప్రతీకగా కడప జిల్లాకు వైఎస్సార్ పేరు పెట్టడం జరిగిందని , అది తాము తీసుకున్న నిర్ణయం కాదని వైసీపీ నేతలు చెబుతున్నారు. 2014-2019 వరకు మీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, అప్పుడు మార్చని పేరు ఇప్పుడెందుకు మార్చాలని అడుగుతున్నారంటూ వైసీపీ నేతలు మంత్రి సత్యకుమార్‌ను ప్రశ్నిస్తున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications