తప్పు చేసింది జగన్ అయినా, పెద్దిరెడ్డి అయినా వదలం, మా లెక్కలు మాకున్నాయి

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని, కుట్ర కోణంలోనే మంటలు వ్యాపించాయని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని, తప్పు చేసిన వారిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఉన్నా, మాజీ సీఎం వైఎస్ జగన్ ఉన్నా సరే ఎవ్వరినీ వదిలిపెట్టమని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారిని ఎవ్వరినీ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.

సోమవారం అమరావతిలోని సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి అనగాని సత్యప్రసాద్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని, కొందరు కావాలనే నిప్పంటించారని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని అన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ఇప్పటికే మూడు రోజులపాటు మదననల్లెలోనే మకాం వేసి బాధితుల నుంచి ఫిర్యాలు స్వీకరించారని మంత్రి అనగాని సత్యప్రసాద్ గుర్తు చేశారు.

చాలా మంది బాధితులు తాము మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన అనుచరుల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఫిర్యాదులు చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నివేదిక తయారు చేసి సీఎం చంద్రబాబు నాయుడికి ఇచ్చారని, తప్పు చేసిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.

Minister Satyaprasad said that Jagan or Peddireddy who did the wrong should be let go

ప్రవేటు వ్యక్తులు ఎవరైనా కోట్ల రూపాయలు విలువ చేసే భూములు లక్షల రూపాయలకే ఇతరులకు ఇచ్చేస్తారా, వాళ్లకేమైనా పిచ్చా, ప్రైవేటు వ్యక్తుల నుంచి వైసీపీ నాయకులు బలవంతంగా భూమలు లాక్కొన్నారని మాకు ఫిర్యాదులు వచ్చాయని, ఆ దిశగా మేము దర్యాప్తు చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు.. ప్రైవేటు వ్యక్తుల భూములకు సంబందించి త్వరలో సమీక్షలు నిర్వహిస్తామని, అన్ని రికార్డులు పరిశీలిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు.

22 ఏ సెక్షన్ లోని భూములుపైనా, అసైన్డ్ భూముల సమస్యలపైనా రెవెన్యూ శాఖ అధ్యయనం చేస్తుందని, వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన భూములపైనా విచారణ జరుగుతుందని, వైసీపీకి అనుకూలంగా ఉంటూ ప్రైవేట్ వ్యక్తులను బెదిరించి లాక్కొన్న భూములను వెనక్కు తీసుకుంటామని, ఆ భూముల యజమాులకు అప్పగిస్తామని, ఒక్క ఎకరా భూమిని కూడా వదిలిపెట్టమని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.

Minister Satyaprasad said that Jagan or Peddireddy who did the wrong should be let go

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో విధులు దుర్వినియోగం చేసి కొందరు వైసీపీ నాయకులకు అనుకూలంగా పని చేసిన మదనపల్లెకు చెందిన ముగ్గురు రెవెన్యూ శాఖ అదికారులను సస్పెండ్ చేశామని, వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములను వైసీపీ నాయకులు అప్పనంగా నొక్కేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+