Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ డ్రామాలు దేనికి? టీడీపీ బీ టీమ్ జనసేన: మంత్రి సీదిరి అప్పలరాజు

మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరు బాట పట్టనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 20వ తేదీన నరసాపురంలో పవన్ కళ్యాణ్ మత్స్యకార అభ్యున్నతి సభను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని మత్స్యకారుల సమస్యలను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉన్న 217 జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై ఏపీ పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పవన్ కళ్యాణ్ పై ఎదురు దాడి చేశారు.

తెలుగుదేశం పార్టీకి బీ టీమ్ గానే జనసేన

తెలుగుదేశం పార్టీకి బీ టీమ్ గానే జనసేన


జనసేన ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి బీ టీమ్ గానే వ్యవహరిస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. పవన్ స్వతంత్రంగా వ్యవహరించి తమ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మంచిని గ్రహించాలని మంత్రి అప్పలరాజు హితవుపలికారు. మత్స్యకారుల కోసం జగన్ సర్కార్ ఎంతో చేస్తుందని పేర్కొన్న మంత్రి పవన్ కళ్యాణ్ వస్తే రాష్ట్రప్రభుత్వం మత్స్యకారులకు నిర్మిస్తున్న 4 షిప్పింగ్ హార్బర్ లను చూపిస్తానని పేర్కొన్నారు. లేదంటే ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వెళ్లి పరిశీలించవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ డ్రామాలు దేనికి ?

పవన్ కళ్యాణ్ డ్రామాలు దేనికి ?

మాజీ సీఎం చంద్రబాబు హయాంలో మత్స్యకారులకు చేసిందేమీ లేదని, ఇప్పుడు వారికి అన్ని రకాలుగా మేలు జరుగుతుందని తెలిసి కూడా ఈ డ్రామాలు ఏమిటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మంత్రి సీదిరి అప్పలరాజు నిలదీశారు. మత్స్యకారులకు చంద్రబాబు చేసిన మోసాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని మంత్రి పేర్కొన్నారు.

వైఎస్ జగన్ చేపలు అమ్ముకుంటున్నారని హేళన చేసింది మీరు కాదా ?

వైఎస్ జగన్ చేపలు అమ్ముకుంటున్నారని హేళన చేసింది మీరు కాదా ?


మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వెల్లడించిన ఆయన మత్స్యకార మహిళలకు గౌరవం దక్కేలా చేపల అమ్మకానికి రిటైల్ అవుట్ లెట్ లు ఏర్పాటు చేస్తున్నామని మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అలా రిటైల్ అవుట్ లెట్ లు ఏర్పాటు చేస్తే అవహేళన చేస్తారా అంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ చేపలు అమ్ముకుంటున్నారు అని నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు తక్షణం వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లి చనిపోతే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.

వేట విరామంలో భృతి ఇవ్వని చంద్రబాబును పవన్ ఏనాడైనా ప్రశ్నించారా?

వేట విరామంలో భృతి ఇవ్వని చంద్రబాబును పవన్ ఏనాడైనా ప్రశ్నించారా?

ఇక వేట విరామంలో భృతి ఇవ్వని చంద్రబాబును పవన్ ఏనాడైనా ప్రశ్నించారా అంటూ మండిపడ్డారు. గతంలో మత్స్యకారులను ఉద్దేశించి చంద్రబాబు తోలు తీస్తా, ఫినిష్ చేస్తానని మాట్లాడారని, అప్పుడు ఏ రోజు పవన్ కళ్యాణ్ స్పందించలేదని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా మత్స్యకారుల పై ప్రేమ కనబరచటానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. జనసేనకు వీలైతే మంచి సలహాలు ఇవ్వాలి కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని దూషిస్తే మత్స్యకారులు సహించబోరని మంత్రి సీదిరి అప్పలరాజు తేల్చి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+