అవినీతి తారాస్ధాయికి, చర్యలు తప్పవు: మంత్రి సిద్ధా

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ, రవాణా శాఖల్లో అవినీతి తారాస్ధాయికి చేరిందని ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ధ్వజమెత్తారు. రహదారుల శాఖ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పనుల నాణ్యతను గాలికి వదిలేశారని మండిపడ్డారు.

మడకశిర వద్ద బస్సు ప్రమాదం విచారణలో ఇదే తేలిందని అన్నారు. తడ చెక్ పోస్ట్ వద్ద అధికారులు బరితెగించి వ్వవహారిస్తున్నారని అన్నారు. అధికారులు తమ పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Minister Sidda Raghavarao slams transport department

సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు

సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ట్రాఫిక్ దృష్ట్యా సోమ, మంగళవారాల్లో బస్సులు బయల్దేరు ప్రాంతాల్లో మార్పులు చేశారు. జూబ్లి బస్‌స్టేషన్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ బస్సులు నడుపుతున్నారు.

సెంట్రల్ బస్ట్‌స్టేషన్ నుంచి కర్నూలు, అనంతపురం, కడప, ఒంగోలు బస్సులు బయలు దేరతాయి. దిల్‌సుఖ్‌నగర్ నుంచి నల్లగొండ, మిర్యాలగూడ వైపు బస్సులు బయలుదేరతాయి. ఉప్పల్ నుంచి వరంగల్, యాదగిరి గుట్టవైపు బస్సులు బయలుదేరతాయి. మహాత్మా గాంధీ బస్‌స్టేషన్ నుంచి ఖమ్మం, మహబూబ్‌నగర్, విజయవాడ, గుంటూరు బస్సులు బయలుదేరతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+