రాజధాని: ప్రతి వారం సింగపూర్‌కి నారాయణ బృందం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రణాళికను సింగపూర్ ప్రభుత్వం మే 15వ తేదీ నుండి మే నెలాఖరులోగా అందజేయనుంది. ఈ అంశం పైన కొంత సమాచార సేకరణ కోసం సింగపూర్ సర్వే నిపుణుల బృందం ఆదివారం గుంటూరుకు వస్తోంది.

ఈ ప్రక్రియలో సింగపూర్ ప్రభుత్వానికి అవసమరైన సహకారం అందించేందుకు ఇక నుండి ప్రతి ఆదివారం ఒక బృందం సింగపూర్‌కు వెళ్లనుంది. ఈ బృందంలో మంత్రి పీ నారాయణ, ఇతర అధికారులు ఉంటారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన సూక్ష్మస్థాయి ప్రణాళిక సిద్ధమయ్యే లోగా నారాయణ నేతృత్వంలో వారు వెళ్లనున్నారు.

రాజధానిలో నీటివనరుల వర్సిటీ

Minister team to Singapore every week

రాజధాని కేంద్రంగా వాటర్‌ రిసోర్స్‌ యూనివర్సిటీ నెలకొల్పుతామని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పేర్కొన్నారు. ఎస్పీఎస్ నెల్లూరులో శనివారం జరిగిన జలవనరుల యాజమాన్య అవగాహన సదస్సులో మాట్లాడారు. జలవనరుల శాఖలో పని చేసే ఇంజనీర్లకు అవగాహన, నీటి యాజమాన్యం వంటి వాటి అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా నీటి వనరుల యూనివర్సిటీని నెలకొల్పుతామన్నారు.

ప్రతి ఇంజనీరు బాధ్యతగా, పారదర్శకంగా పని చేయాలని, పైరవీలను పట్టించుకోవద్దని సూచించారు. 9మంది సీనియర్‌ ఇంజనీర్లు రిటైర్‌ అయినా వారి సేవలను వినియోగించుకుంటున్నామని, పదవీ విరమణ పొందిన ఇంజనీర్లు ముందుకు వస్తే వారికి కూడా బాధ్యతలు అప్పచెబుతామన్నారు. ఓఅండ్‌ఎం పనులకు రాష్ట్ర స్థాయిలో నిధులు విడుదల చేసే విధానాన్ని పక్కన పెట్టి ఆయా జిల్లాలకే బాధ్యతలు అప్పగిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+