ఆరోగ్య శ్రీ పై సమీక్ష: ఆ ఆసుపత్రులపై నిఘా పెంచాలన్న మంత్రి విడదల రజిని

ఆరోగ్య శ్రీ పై సమీక్ష నిర్వహించిన మంత్రి విడదల రజిని అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని రాష్ట్రంలోని ఆసుపత్రులలో వైద్య సదుపాయాల కల్పన పై దృష్టి సారిస్తూనే ఎప్పటికప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించే ఆసుపత్రుల పైన కూడా దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించే ఆసుపత్రులపై నిఘా పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యకలాపాల పనితీరుపై సమీక్షించిన మంత్రి ఈ మేరకు అధికారులకు పలు సూచనలు చేశారు.

ఆరోగ్య‌శ్రీ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి విడదల రజిని

ఆరోగ్య‌శ్రీ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి విడదల రజిని

ఆరోగ్య‌శ్రీ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆరోగ్య‌శ్రీ అమ‌లవుతున్న తీరు, పేషెంట్లకు అందుతున్న వైద్యం గురించి, కొత్త‌గా అమ‌ల్లోకి వ‌చ్చిన చికిత్స‌ల‌కు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఈ కార్యక్రమానికి హాజ‌రైన వైద్యారోగ్య శాఖ‌,ఆరోగ్య‌శ్రీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న వైద్య సేవలను మంత్రి విడదల రజనీకి తెలియజేశారు.

ఆసుపత్రుల్లో వసతుల సమీక్షకు ప్రత్యేకంగా కమిటీ

ఆసుపత్రుల్లో వసతుల సమీక్షకు ప్రత్యేకంగా కమిటీ

ఆసుపత్రిలోని వసతుల గురించి సమీక్ష చేయడానికి ప్రత్యేకంగా కమిటీ వేయాలని, భీమా కంపెనీలలో మాదిరిగా ఆసుపత్రుల పనితీరుపై ఆడిటింగ్ విధానాన్ని అమలు చేయాలని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో రాష్ట్ర ప్రభుత్వం అధికంగా పెంచిన చికిత్సల వల్ల గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఖర్చయిందని పేర్కొన్న రజిని, గత జూన్ నుండి ఇప్పటివరకు 112.78 కోట్లు ఎక్కువ ఖర్చయిందని వెల్లడించారు. ఇక అసరా కింద రోజుకి 1.5 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నామని పేర్కొన్నారు మంత్రి విడదల రజిని.

ఈ ఐదేళ్ళలో పదివేల కోట్ల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చు: మంత్రి విడదల రజిని

ఈ ఐదేళ్ళలో పదివేల కోట్ల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చు: మంత్రి విడదల రజిని


ఎన్నడూ లేని విధంగా ఈ ఐదు సంవత్సరాలలో పదివేల కోట్ల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చు పెట్టనున్నట్టు వెల్లడించారు. అంతేకాదు ఆయుష్మాన్ భారత్ ద్వారా 2022లో ఇప్పటివరకు మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందాయని ఆమె తెలిపారు. 361.57 కోట్ల రూపాయల విలువైన చికిత్సలు ఆయుష్మాన్ భారత్ ద్వారా అందించినట్టు మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.

గిరిజన ప్రాంతాల్లో అంబులెన్స్ ల సంఖ్య పెంచాలన్న మంత్రి రజిని

గిరిజన ప్రాంతాల్లో అంబులెన్స్ ల సంఖ్య పెంచాలన్న మంత్రి రజిని


ఇక గిరిజన ప్రాంతాలలో వైద్య సదుపాయాలపై అధికారులకు సూచనలు చేసిన మంత్రి గిరిజన ప్రాంతాలలో అంబులెన్స్ ల సంఖ్యను పెంచాలన్నారు. 108 అంబులెన్స్ లు ఘటన స్థలానికి చేరుకునే సమయంలో ఫోన్ చేసిన వారికి ఆ వాహనం ఎక్కడుందో తెలియడం కోసం మొబైల్ ఫోన్ కు రూట్ మ్యాప్ లింకు పంపేందుకు ప్రయోగాత్మకంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి విడదల రజిని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ గా చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని విడదల రజని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+