ఆర్ 5: టీడీపీ, చంద్రబాబుకు ఏ మాత్రం ఇష్టం లేదు..

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న అంశం- రాజధాని అమరావతి పరిధిలోని ఆర్ 5 జోన్‌లో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ. దీనికి ముహూర్తాన్ని కూడా పెట్టింది. లబ్దిదారులకు ఈ నెల 24వ తేదీన పట్టాలను పంపిణీ చేయనుంది. వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వెంకటాయపాలెంలో బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.

అమరావతి ప్రాంతంలో కొత్తగా ఆర్ 5 జోన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని ముఖ్య ఉద్దేశం- పేద‌ల ఇళ్ల నిర్మాణాలు చేప‌ట్టడమే. అందరికీ ఇళ్లు పథకం కింద అమరావతిలో కూడా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం గతంలో గెజిట్ ​నోటిఫికేషన్ ​విడుదల చేసింది.

Minister Vidadala Rajini slams TDP leaders including Chandrababu.

తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో సుమారు 900 ఎకరాలకుపైగా పేదల ఇళ్ల నిర్మాణాల కోసం నోటిఫై చేసింది. దీనికోసం అమరావతి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో కూడా మార్పులు చేర్పులు చేసింది ప్రభుత్వం. గుంటూరు, విజయవాడకు చెందిన 28 వేల మందికి ప్రస్తుతం ఆర్‌-5 జోన్‌ పరిధిలోకి తీసుకువచ్చింది.

ఇళ్ల నిర్మాణ పనులను ఇవ్వాళ గుంటూరు జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పరిశీలించారు. అలాగే- వెంకటాయపాలెంలో వైఎస్ జగన్ బహిరంగ సభ ఏర్పాట్లనూ పరిశీలించారు. సుమారుగా రెండు లక్షల మంది ఈ సభకు హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి.

ఈ సందర్భంగా మంత్రులు విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో పేదల సొంతింటి కల నిజమవుతోందని, ఇది ప్రతిపక్ష పార్టీల నాయకులకు కనువిప్పులాంటిదని విడదల రజిని అన్నారు. ప్రతి పేదవాడికీ సొంతింటిని కల్పించాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలకు పూనుకున్నారని చెప్పారు.

దీన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ఎంతగా అడ్డు పడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఆమె గుర్తు చేశారు. న్యాయస్థానాల్లో కేసులు వేయించారని విమర్శించారు. పేదలు ఎదగడం తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం ఇష్టం ఉండదని చురకలు అంటించారు.

ధనవంతులు ధనవంతులుగా, పేదలు పేదలుగానే ఉండాలనేదే టీడీపీ విధానమని మండిపడ్డారు. టీడీపీ పేదల వ్యతిరేకిగా మిగిలిపోక తప్పదని వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు ఎంతగా అడ్డుపడ్డా చివరికి న్యాయమే గెలిచిందని విడదల రజినీ అన్నారు. వచ్చే ఎన్నికల తరువాత టీడీపీ రాష్ట్ర రాజకీయాల్లో ఉండదని జోస్యం చెప్పారామె.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+