చంద్రబాబు బతుకేంటో అమిత్ షా కు తెలియదా? కుట్రలు బాబుకు వెన్నతో పెట్టిన విద్య: మంత్రులు అవంతి, కన్నబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి నేత పట్టాభి వ్యాఖ్యల తర్వాత, వైసిపి కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి కార్యాలయాలపై దాడులు చేయడం రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణమైంది. ఇక టిడిపి అధినేత చంద్రబాబు దాడి జరిగిన టీడీపీ కేంద్ర కార్యాలయంలో 36 గంటల నిరసన దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసీపీ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు వల్లే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబుకు కుట్రలు వెన్నతో పెట్టిన విద్య : అవంతి శ్రీనివాస్

చంద్రబాబుకు కుట్రలు వెన్నతో పెట్టిన విద్య : అవంతి శ్రీనివాస్

రాష్ట్రంలో చంద్రబాబునాయుడు చేస్తున్న కుట్రలకు అంతే లేకుండా పోతుందని, చంద్రబాబు కుట్రలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని వైసిపి మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఫ్రస్టేషన్ లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత పట్టాభి కోసం చంద్రబాబు దీక్ష చేయడమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న దీక్షలపై ఆయన తన అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. చంద్రబాబు జీవితమంతా నేరమయమని అవంతి శ్రీనివాస్ విమర్శించారు.

పార్టీ ఆఫీస్ లో బల్లలు విరిగితే రాష్ట్రపతి పాలన పెట్టాలా ?

పార్టీ ఆఫీస్ లో బల్లలు విరిగితే రాష్ట్రపతి పాలన పెట్టాలా ?

పార్టీ ఆఫీసులో రెండు బల్లులు విరిగితే రాష్ట్రపతి పాలన పెట్టాలా అని ప్రశ్నించిన అవంతి శ్రీనివాస్ చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. వంగవీటి రంగా, మల్లెల బాబ్జీ, ఎన్టీఆర్ మరణాలకు చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు అవంతి శ్రీనివాస్. మోకాలుకీ బోడి గుండుకు, లింకు పెట్టే తత్వం చంద్రబాబుదని అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతికి నిలబడిన ముద్రగడ కుటుంబంపై అమానుషంగా ప్రవర్తించింది అప్పుడే మర్చిపోయారా అంటూ అవంతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు.

చంద్రబాబు చేసినవిమర్చిపోయి నీతి వాక్యాలు చెప్తున్నారు

చంద్రబాబు చేసినవిమర్చిపోయి నీతి వాక్యాలు చెప్తున్నారు


చంద్రబాబుకి మతిమరుపు ఎక్కువని ఆయన చేసిన పనులు అన్నీ మరిచిపోయి ఇప్పుడు నీతివాక్యాలు చెబుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీని లోకేష్ ను జనాలు ఆదరించరని తెలిసి ఆ ఒత్తిడిలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. మూడుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు, పట్టాభి కోసం దీక్ష చేస్తారా అంటూ ప్రశ్నించారు. పట్టాభిని పిచ్చాసుపత్రిలో చేర్పించాలి అని, పిచ్చోడి మాటలు పట్టుకుని చంద్రబాబు వేలాడుతున్నారని అసలు తెలుగుదేశం పార్టీలో పట్టాభి ఎవరు అంటూ పార్టీలో ఉన్న నాయకులు సైతం తలపట్టుకుంటున్నారు అనిమంత్రి అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.

 అయ్యన్న వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు : అవంతి శ్రీనివాస్

అయ్యన్న వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు : అవంతి శ్రీనివాస్

ఇదే సమయంలో అయ్యన్నపాత్రుడుని టార్గెట్ చేసిన అవంతి శ్రీనివాస్ అయ్యన్నపాత్రుడు చెబుతున్న మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అని మాట్లాడితే ముందు అయ్యన్నపాత్రుడును అరెస్టు చేయాలని అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు వైసీపీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి.. ఇలా అందరినీ తిట్టడం అయిపోయిందని, ఇక మిగిలింది ప్రజలేనంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నారంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.

చంద్రబాబు బతుకేంటో అమిత్ షా కు తెలియదా : మంత్రి కన్నబాబు

చంద్రబాబు బతుకేంటో అమిత్ షా కు తెలియదా : మంత్రి కన్నబాబు

చంద్రబాబు అంటేనే కుట్రలని వైసిపి వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. తన అవసరాల కోసం చంద్రబాబు ఎలాంటి కుట్రలు అయినా చేస్తారని, రాష్ట్రంలో ప్రస్తుతం టిడిపి నేతలు చేస్తున్నది అదేనని మండిపడ్డారు. తన ఉనికి కోసం చంద్రబాబు డ్రామా క్రియేట్ చేసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కన్నబాబు. చంద్రబాబు బతుకేంటో అమిత్ షా కు తెలియదా అంటూ ప్రశ్నించిన మంత్రి చంద్రబాబు చేసేది కొంగ జపం అంటూ మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఈర్ష్య, అసూయ తోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+