తెలంగాణ ఎఫెక్ట్: లోకసభ వైపు సీమాంధ్ర సీనియర్ల దృష్టి

 Ministers eyes Lok Sabha in General Election
హైదరాబాద్: 2014 సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు లోకసభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట. రాష్ట్ర విభజనకు ముందే కాంగ్రెసు పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు లోకసభ పైన దృష్టి సారించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ పైన ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత నాయకులు పలువురు లోకసభకు పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై ఆలోచన చేస్తున్నారట.

కొద్ది నెలల క్రితం హైదరాబాదుకు చెందిన ఓ మంత్రి సికింద్రాబాదు నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చారు. ఇది సదరు మంత్రి, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. తాజా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు లోకసభ స్థానం నుండి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, మహీధర్ రెడ్డిల్లో ఒకరు పోటీ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు.

రాయలసీమ ప్రాంతంలో కూడా ఓ మంత్రి లోకసభకు పోటీ చేయనున్నారట. తెలంగాణ ముసాయిదా బిల్లు నేపథ్యంలో వచ్చే ఎన్నికలలోగా తెలంగాణ ఏర్పడుతుందని కాంగ్రెసు పెద్దలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు లోకసభ ఎన్నికలతో పాటు జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు.

అదే జరిగితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మల్కాజిగిరి లేదా హిందూపురం నుండి లోకసభకు పోటీ చేస్తారనే ప్రచారం కొద్దికాలంగా జరుగుతోంది. గుంటూరు లోకసభ స్థానానికి టిడిపి నుండి మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ సిద్ధంగా ఉన్నారు. టిడిపి నేత రేవంత్ రెడ్డి కూడా మల్కాజిగిరి నియోజకవర్గం నుండి అవకాశం వస్తే పోటీకి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో లోకసభకు పోటీ చేయడం ఉత్తమమని ముఖ్యంగా పలువురు కాంగ్రెసు నేతలు భావిస్తున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+