'వైయస్ జగన్ ఆ విషయం మరిచిపోయారు, 2019లో వైసీపీ గల్లంతు'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మాటలు చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారని మంత్రి సుజయ కృష్ణ రంగారావు అన్నారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రజా సంకల్ప యాత్రపై విమర్శలు గుప్పించారు.

బాబుకు 'బిగ్' షాక్, పోలవరంపై కేంద్రం తిరకాసు, మన్మోహన్ ప్రభుత్వం అంచనాల వల్లే

ఆ విషయం జగన్ మరిచిపోయారు

ఆ విషయం జగన్ మరిచిపోయారు

జగన్ మాట మీద నిలబడలేని వ్యక్తి అన్నారు. ప్రత్యేక హోదా కోసం తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పారని, కానీ ఆ తర్వాత ఆ విషయం మరిచిపోయారని సుజయ ఎద్దేవా చేశారు.

పరిపక్వత లేని పాదయాత్ర

పరిపక్వత లేని పాదయాత్ర

అలాంటప్పుడు జగన్ మాట మీద నిలబడే వ్యక్తి ఎలా అవుతాడని సుజయ నిలదీశారు. రాజీనామాలపై ఆయన మాట తప్పారన్నారు. పరిపక్వత లేని పాదయాత్ర అన్నారు.

2019లో వైసీపీ అడ్రస్ గల్లంతు

2019లో వైసీపీ అడ్రస్ గల్లంతు

ప్రతిపక్ష నేత పదవికి జగన్ సరిపోడని తేలిపోయిందని మరో మంత్రి నారాయణ అన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. కోర్టు హాజరు తప్పించుకోవడానికే జగన్ పాదయాత్ర ప్రారంభించారని ఆరోపించారు.

విచారణ జరిగితే శిక్ష పడుతుందనే

విచారణ జరిగితే శిక్ష పడుతుందనే

కోర్టుల్లో విచారణ జరిగితే శిక్ష పడుతుందని జగన్ పాదయాత్ర నాటకం ఆడుతున్నారని నారాయణ మండిపడ్డారు. అలాగే పారడైజ్ పేపర్లలో తన పేరు ఉండటంపై జగన్ స్పష్టమైన సమాధానం ఇవ్వాలని నిలదీశారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన ప్రతిపక్షం పారిపోవడం బాధాకరమన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ministers Sujaya Krishna Ranga Rao and Narayana fired at YSR Congress party chief YS Jaganmohan Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి