వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖాళీగా ఉన్నామనే నంద్యాలకు: మంత్రులు, రోజా అలా అనుకుంటున్నారేమే

నంద్యాలకు మంత్రులు వెళ్తుండటంపై వైసిపి విమర్శలు చేసింది.దీనిపై మంత్రులు అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు నిప్పులు చెరిగారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: నంద్యాలకు మంత్రులు వెళ్తుండటంపై వైసిపి విమర్శలు చేసింది. దీనిపై మంత్రులు అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు నిప్పులు చెరిగారు. నంద్యాలలో రేషన్ కార్డు, తాగునీరు ఇలా ప్రజలకు ఏం కావాలో అన్ని పరిశీలించేందుకు మంత్రులం వెళ్తున్నామన్నారు.

కొత్త ట్విస్ట్: అఖిలప్రియ వారిని నమ్మడం లేదా, శిల్పాకు చిక్కులు?కొత్త ట్విస్ట్: అఖిలప్రియ వారిని నమ్మడం లేదా, శిల్పాకు చిక్కులు?

దాని పైనా వైసిపి విమర్శలు చేస్తున్నారన్నారు. పోటీ ఉన్నప్పుడు అభివృద్ధి చేయాలని, ఓటు అడగాలని, ఖాళీగా ఉన్నాం కాబట్టి మంత్రులం ఎక్కువమంది నంద్యాల ఉప ఎన్నికల కోసం వెళ్తున్నామని చెప్పారు.

Ministers says why they are going to Nandyal

ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేయిస్తున్నవారే హెరిటేజ్‌ స్టిక్కర్లు వాహనాలకు వేసి ఎర్రచందనాన్ని తరలిస్తున్న పరిస్థితి ఉందని, అంతేతప్ప ఎర్రచందనం తరలించేంత దిగజారే పరిస్థితిలో ఆ సంస్థ లేదని చెప్పారు.

చిత్తూరులో ఎర్రచందనం దుంగలతో దొరికిన వాహనం హెరిటేజ్‌ సంస్థకు చెందినది కాదని చెప్పారు. ఈ వాహనం విషయమై వైసిపి ఎమ్మెల్యే రోజా చేసిన ఆరోపణలకు వారు కౌంటర్ ఇచ్చారు.

రాజకీయాలనూ టీవీ సీరియల్స్‌ అని రోజా అనుకుంటున్నట్లున్నారని, వాస్తవం తెలుసుకోకుండా పసలేని నస ఆరోపణలు చేశారన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌, పాదాభివందనాలు వైసిపికే చెల్లుతాయన్నారు.

ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్‌ గంగిరెడ్డి ఏ పార్టీ వ్యక్తి? ఇప్పటి వరకూ పట్టుబడిన ఎర్రచందనం దొంగల్లో వైసిపి వారి సంఖ్య ఎంత? ఇవన్నీ వదిలేసి అనవసర రాజకీయం చేస్తారా? అసలు కేసుల్లో చిక్కుకుపోయిన జగనే ఇక్కడ భయం కలిగితే వెంటనే అక్కడ ఢిల్లీలో ప్రత్యక్షమవుతున్నారన్నారు. ప్రధాని అడక్కపోయినా రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతునిస్తామని చెప్పారని విమర్శించారు.

English summary
Ministers Adinarayana Reddy and Amarnath Reddy said why they are going to Nandyal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X